ఏయే దేశం లో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం :
ఫ్రాన్స్ దేశం లో క్రిస్టమస్ వేడుకలు డిసెంబర్ ఆరు నుంచే మొదలు అవుతాయి. దాదాపు నగరాలు అనింటినీ  చాలా గొప్పగా అలంకరిస్తారు .. పిల్లలకి స్వీట్లు బహుమతులు అందిస్తారు.  పిల్లలు తమ బూట్లను పాలిష్‌ చేసి మరీ తమ ఇంట్లోని చిమ్నీల దగ్గర ఉంచుతారు. ఇలాగైనా శుచీ శుభ్రత పిల్లలకు ముందు నుంచే అలవడతాయనేమో. పిల్లల సరదా మాత్రం వేరు. క్రిస్టమస్‌ తాత వాటి నిండా స్వీట్లు నింపుతాడని వారి నమ్మకం. 
Related image

ఇక నెథర్లాండ్స్ లో ఐతీ శాంతా క్లాస్ ని సిన్స్తర్ క్లాస్ అని పిలుస్తారు. ఆతను వారికి ఎక్కడో ఉత్తర ధృవంపై కాక స్పెయిన్‌లో నివసిస్తాడని, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్‌ పీటర్‌ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడని ప్రజలు భావిస్తారు. అయితే అక్కడ సంస్కృతి ప్రకారం బ్లాక్ పీటర్ బానిస పాత్ర పోషిస్తారు .. కానీ క్రిస్టమస్ వేడుకల్లో అంతా సంతోషం నింపుతారు. ఒక ఫామిలీ కి మరొక ఫామిలే గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. 
Related image

జర్మనీలో కూడా క్రిస్టమస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఎక్కడ బడితే అక్కడ ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తారు. వాటిలో క్రిస్టమస్‌కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా గ్లూవైన్‌ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు పట్టి వున్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు.
Image result for christ birth
ఈ పానీయం కేవలం క్రిస్టమస్‌ రోజుల్లో మాత్రమే తయారు చేస్తారు.
ఇటలీలో శాంటా క్లాస్‌ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచిపెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని నమ్మకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: