క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు జన్మదినం అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఓ గొడ్ల చావిడిలో జన్మించిన విషయామూ తెలుసు. రోము సామ్రాజ్యాన్ని సీజరు పరిపాలిస్తున్న రోజుల్లో యేసు జన్మించాడు. దేశప్రజలంతా జనాభా లెక్కల నిమిత్తం తమ స్వస్థలాలకు రావాలని సీజర్ ఆజ్ఞాపించాడు.

Image result for jesus birth images


క్రీస్తు తల్లిదండ్రులైన యేసేపు, మరియ.. తమ స్వస్థలం - బెత్లహేము పయనమయ్యారుఆ సమయంలో మరియ నిండుచూలాలు. ప్రసవ సమయం ఆసన్నమైంది. అందుకే బెత్లహేములోని ఒక సత్రంలో ఆ రాత్రి తలదాచుకున్నారు. ఆ సత్రం యాత్రికులతో కిక్కిరిసి ఉండటం వల్ల వారికి పశువుల పాకే ఆశ్రయం ఇచ్చింది.

Image result for jesus birth images


పశువుల పాకలోని ఓ తొట్టె అప్పుడే పుట్టిన యేసును పడుకోబెట్టారు. ఏసు జన్మ వృత్తాంతంలోనే ఓ అద్భుతమైన సందేశం కూడా ఉంది. ఎలాగంటే.. మానవ హృదయం ఒక నివాస స్థలం. అది పశువుల పాకలా అపరిశుభ్ర వాతావరణంలో ఉంది.

Related image


క్రీస్తు తాను జన్మించే చోటును అక్కడే వెతుక్కున్నాడు. అంటే మానవ హృదయాల్ని శుద్ధపరచి మహోన్నతులుగా చేసేందుకే ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు నరావతారంలో ఈ లోకంలోకి వచ్చాడు. అంటే సంపూర్ణ మానవత్వమే దివ్యత్వానికి దారి చూపుతుందని తన సేవ, కరుణ, ప్రేమలతో లోకానికి ఆయన చెప్పకనే చెప్పాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: