దేవుడు, ఆధ్యాత్మికత, మోక్షం.. ఇవి మనిషిని ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. క్రైస్తవ మతానికి ముందు కూడా ఈ లోకంలో ఎన్నో మతాలు పుట్టాయి. క్రైస్తవం తర్వాత కూడా ఎన్నోమతాలు వచ్చాయి. కానీ ప్రపంచంలో క్రైస్తవం ఎందుకు అంతగా వ్యాపించింది.

Related image


ఇందుకు ప్రధాన కారణం.. ఏసు బోధనల్లోని సరళత, సులభతరమే. ఔను.. అంతకుముందు.. ఆ తర్వాత దేవుడు, మోక్షం, ఆధ్యాత్మికత.. లాంటి పదాలు సామాన్యులకు అర్థం కాని బ్రహ్మపదార్థాల్లా ఉండేవి.. కానీ.. క్రైస్తవం అలా కాదు.. ఏసు క్రీస్తు బోధనలు సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి.

Image result for jesus way

ఏసు క్రీస్తు ప్రేమ తత్వాన్ని ఉపదేశించాడు. కరుణ, ప్రేమ, త్యాగం... ఇవే క్రీస్తు ప్రేమతత్వంలోని ముఖ్యమైన అంశాలు. ఇవి అందరికీ అన్ని కాలాల్లోనూ ఆచరణ యోగ్యమే కదా. ద్వేషం, పగ, వైషమ్యం వంటి అవగుణాలతో నరుడు దైవత్వానికి దూరమవుతున్నాడు. అందుకే ఏసు మార్గం అందరినీ ఆకర్షించింది.

Related image


తోటి మనిషిని ప్రేమిస్తే దేవుణ్ని ప్రేమించినట్లే. ఇదే క్రీస్తు మార్గం. హృదయంలోకి దేవుణ్ని ఆహ్వానించడానికి ఏకైక మార్గం సాటి మనిషిని ప్రేమించడమే. ఈ ప్రేమ సూత్రాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమే.. ఈ క్రిస్మస్‌ పర్వదినం. అందుకే క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. ప్రపంచానికి ప్రేమను పంచే పండుగ.


మరింత సమాచారం తెలుసుకోండి: