ఈ భూమి మీద అతి తక్కువ కాలం కేవలం మూడున్నర సంవత్సరాలు బోధించిన క్రీస్తు ఆయన బోధనలు ప్రపంచంలో ఉన్న మనిషిని ఎంతగానో ప్రభావితం చేశాయి. సామాన్యులైన జాలర్లను మరియు ఇతర ఇతర పనులు చేసే వారిని 12 మందిని శిష్యులుగా ఏర్పరుచుకుని క్రీస్తు చెప్పిన బోధలు మాటలు బహు ప్రభావితమైనవని ప్రపంచంలో ఉన్న మనిషి జీవిత గమనాన్నే మార్చేశాయి అని చాలామంది చరిత్రకారులు మరియు ప్రముఖులు అంటుంటారు.

Image result for christmas crib

ముఖ్యంగా ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు మరియు మూఢనమ్మకాలు మనిషిని వింతగా మరియు అసహ్యంగా.. అంటరాని వానిగా చూస్తున్న రోజుల్లో క్రైస్తవ మిషనరీలు అటువంటి ప్రాంతాలలో క్రీస్తు ప్రేమను తమ క్రియల ద్వారా చూపించి నలిగిపోతున్న మనిషికి వెలిగించే జీవితాన్ని క్రీస్తు క్రియల ద్వారా తెలియజేశారు. చీకటిలో నలిగిపోతున్న చాలా దేశాలలో మిషనరీలు క్రీస్తు ప్రేమను తమ వ్యక్తిగత జీవితం ద్వారా ఆయా దేశాలలో జీవించి వాటిని వెలుగుగా మలిచారు.

Image result for christmas crib

ముఖ్యంగా కొండ ప్రాంతాలలో కనీస అభివృద్ధికి నోచుకోని ప్రజల మధ్య క్రైస్తవ మిషనరీలు చాలా హాస్పిటల్ లు పెట్టి..విద్యాలయాలు స్థాపించి సామాన్య ప్రజలను చదువుకునే స్థాయికి మరియు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఉండే విధంగా క్రీస్తు బోధల ద్వారా నిరూపించారు. ముఖ్యంగా క్రీస్తు బోధలలో ప్రేమ, దయ, క్షమాపణ వంటి అంశాలు చాలా ప్రభావితం గా ఉంటాయని చాలామంది బైబిల్ చదివిన ప్రముఖులు అంటుంటారు.

Related image

అంతేకాకుండా క్రీస్తు క్రైస్తవ మతం స్థాపించడానికి రాలేదని..బైబిల్ పరంగా దేవుని రాజ్యానికి చూపించే మార్గంగా ఈ భూమి మీదకి వచ్చాడని..అందుకే క్రీస్తు దేవుని రాజ్యానికి....నేనే(క్రీస్తు) మార్గము, సత్యము, జీవము అని అన్నాడని అంటుంటారు క్రైస్తవులు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: