నిరాశా నిస్పృహలతో కూరుకుపోయారా.. ఈ జీవితంలో వెలుగు కనిపించడం లేదా.. మీపై మీరు నమ్మకం కోల్పోయారా.. జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయా.. ఏం చేయాలో దిక్కు తోచడం లేదా.. ఇలాంటి ఆలోచనల నుంచి మిమ్మల్ని బయటపడేసే ఒక చక్కటి మార్గం.. ఈ పదిరూపాయల పుస్తకం.

swami vivekananda his call to nation book కోసం చిత్ర ఫలితం


పది రూపాయల పుస్తకం జీవితాన్ని మారుస్తుందా అంటే కచ్చితంగా మారుస్తుందని చెపొచ్చు. కాకపోతే.. ఆ చిన్న పుస్తకాన్ని పదే పదే చదవాలి. దాని అంతరార్థం అర్థం చేసుకోవాలి. ఆ పుస్తకం ఆత్మను ఆవాహన చేసుకోవాలి. అలా చేయగలిగితే ఈ చిన్న పుస్తకం అద్భుతమే చేస్తుంది.

swami vivekananda quotes in telugu కోసం చిత్ర ఫలితం


ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటారా.. అదే.. స్వామీ వివేకానంద రచించిన హిజ్‌ కాల్‌ టు ది నేషన్‌.. తెలుగులో భారతజాతికి నా హితవు. దీనికి రుజువు ఏంటంటారా.. తీవ్ర కలతలతో కుంగిపోయిన ఓ యువకుడు ఇక మరణమే శరణ్యమని నిర్ణయించుకున్నాడునిర్వేదంతో దిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.

swami vivekananda quotes in telugu కోసం చిత్ర ఫలితం


ఆ సమయంలో అల్లంత దూరాన బుక్‌స్టాల్‌లో ఈ చిన్న పుస్తకం కనిపించిందిజేబులో మిగిలిన పావలాతో.. అప్పట్లో ధర అంతేలెండి.. ఆ పుస్తకాన్ని కొన్నాడు..ఒక్క పేజీ తిరిగేయగానే ఆయనలో ఎక్కడలేని ఉత్తేజం నిండిపోయిందిఏదో మంత్రశక్తి ఆవహించినట్టు ఆ పుస్తకంలోని ఒక్కో సూక్తి ఆయనకు ఎంతో ప్రేరణను ఇచ్చాయి

సంబంధిత చిత్రం


చావు తప్ప మరోమార్గం లేదనుకున్న ఆయనను పల్లె వైపు పరుగులు పెట్టించింది ఆ పుస్తకంమరణం అంచువరకూ వెళ్లిన ఆ వ్యక్తిని కార్యశీలిగాఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దిన పుస్తకమే ఈ హిస్ కాల్ టు నేషన్.  ఆ యువకుడే ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే..! అయితే ఒక్క కండిషన్.. టన్నుల కొద్దీ ఆశయాల కన్నా గ్రాము ఆచరణ విలువైనది అంటారు. ఆ ఆచరణ ఉంటే.. జీవితంలో విజయం మీదే.


మరింత సమాచారం తెలుసుకోండి: