హిందూ ధర్మం ప్రకారం ఎంతో మంది దేవుళ్లు దేవతలు ఉన్నా కేవలం వారి రూపాలు మాత్రమే కొలుస్తారు. కానీ ఒక్క శివుడిని మాత్రం లింగంగా పూజించడం విశిష్టత. క్షీరసాగర మధనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.

Related image

అయితే సృష్టిని రక్షించడానికి ఆ ధారాలను తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు శివుడు. అందుకే శివుని గరళకంఠుడు గా అని కూడా భక్తులు పిలుస్తారు. ఇంకా శివుడు అనేక విశిష్టతలు మరియు రూపాలు కలిగి ఉన్నవాడు. అంతటి విశిష్టత కలిగి ఉన్న శివుడికి శివరాత్రి రోజు పూజ చేస్తే ఎంతో ఉత్తమమని పుణ్యమని అంటుంటారు హిందూ భక్తులు.

Image result for lord shiva

శివ అనే నామానికి అర్థం ఒకటి శుభప్రదం అయితే మరొకటి మంగళకరమని పేర్కొంటున్నారు శివుని భక్తులు. హిందువుల దేవుళ్ళ లో ఇంతటి విశిష్టత కలిగిన శివుడి గురించి హిందువులు శివరాత్రి రోజు జాగరణ చేసి ఆ శివుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు.

Image result for lord shiva

ఆ రోజంతా శివరాత్రి రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణతో మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రినాడు ఉపవాసం, జాగరణ చేసినవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: