మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహశివ రాత్రిని హిందువులు ఏంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు.

Image result for maha shivaratri

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి

1) ఉపవాసం ఉండటం

2) రాత్రి జాగరణ చేయడం

3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం

Related image

శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది.ఒకసారి బ్రహ్మ, విష్ణుల మధ్య మాటమాటపెరిగి తమలో ఎవరు గొప్పో అని తేల్చుకోవా లను కున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది.ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తనశక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.


బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది,అంతం తెలుసు కోవలని విష్ణువు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు.

Image result for maha shivaratri

వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది,తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తేల్చుకోలేక పోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గోప్ప అనే వాదనతో ఉన్నదానిని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు.దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆరోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.

Image result for lingodbhavam

శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవిధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మీ మూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి.గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి .పూజగదిలో ముగ్గులు వేసుకుని రక రకాల పూలతో అలంకరించుకోవాలి.లింగకారంలోఉన్న శివునికి జలంతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను,బిల్వపత్రాలను,తుమ్మిపూలను,గోగుపూలు,తెల్లని,పచ్చనిపూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించాలి.తాంభూలం,అరటి పండు, జామపండు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి.ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


విశ్వానికే ఆది దేవుడు శివునితో ఉపవసించటం అనేది ఒక మహాభాగ్యం.ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్నే తలుస్తూ మనసంతా ఆ మహాద్భుత రూపాన్ని నింపుకొని భక్తి  ప్రపత్తులతో జాగరణ సమర్పించటం మహ శివరాత్రి రోజు శివ భక్తులు చెసే పవిత్ర కార్యం.


"ఉపవాసం" — అనగా దగ్గరగా నివసించడం. "ఉప" అంటే దగ్గరగా "వాసం"    అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని నిరాహారంగా ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.


భక్తితో కావచ్చు బరువు తగ్గేందుకు కావచ్చు కారణమేదైనా చాలా మంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.

Image result for brahma vishnu tried to see start and end of Linga

ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండి పోతుంటే బలహీనత, అసిడిటీ, నీరసించి పోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.


మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు, అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి నిండుగా దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు.


దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరాని కి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉప వాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.

 Image result for brahma vishnu tried to see start and end of Linga

ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటి వాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంస కృత్తులు, క్యాల్షియం వంటి వన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.


ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వుపదార్ధాలు కాకుండా, మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గు బియ్యం,కూరగాయ వంటివి కలిపిన కిచిడీ; పాలు, పెసర పప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.

Related image

"జాగరణము" మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు. మహాశివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మరికొందరు 'శివుడి యొక్క మహా.....రాత్రి', అని లేదా  "శివ మరియు శక్తి యొక్క కలయిక " ను సూచిస్తుంద ని అంటారు.


మహా శివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహా శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలసి ఉన్నప్పుడు శివుడు "లింగాకారం" గా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. హిందువుల క్యాలెండర్ లో ఫాల్గుణ మాసము కృష్ణపక్షచతుర్దశి. సంవత్సరంలో ఉన్నపన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింప బడుతుంది.

Image result for lord shiva adiyogi

పండుగ ప్రధానంగా బిల్వదళాలు శివుడికి సమర్పించటం ద్వారా జరుపు కుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివరాత్రి రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగు తుంది.

Related image

తపస్సు, యోగం, ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా మంచి జీవనఫలసాధనకు, ముక్తి పొందడానికి ఉపవాసం జాగరణ తదాత్మ్యతతో నిర్వ హిస్తారు. ఈ రోజు, ఉత్తర దృవం గ్రహస్థానాలు అంతా బలమైనవిగా తపస్సు, యోగ, ధ్యాన చర్యలతో ఒక వ్యక్తి అత్యంత సులభంగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి ఉత్ప్రేరకాలుగా ఉంటాయి. మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రా ల యొక్క ప్రయోజనాల శక్తి మహ శివరాత్రి రోజు వేలరెట్లు పెరుగుతుంది.

Image result for maha mrityunjaya mantra in telugu

పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యచరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము, విభూతి తయారు చేయటానికి మహశివరాత్రి రోజు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ" అంటూ శివ పవిత్ర మంత్రం పఠిస్తారు.

Image result for lord shiva adiyogi

మరింత సమాచారం తెలుసుకోండి: