Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 10:46 am IST

Menu &Sections

Search

కృష్ణార్పణం..!!

కృష్ణార్పణం..!!
కృష్ణార్పణం..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక ఊళ్ళో పేద,అమాయకమైన కృష్ణ భక్తురాలైన  ఒక యాదవ స్త్రీ ఉండేది. గోక్షీరాన్ని,పెరుగు,వెన్న,నెయ్యి అమ్ముకొంటూ..జీవనాన్ని సాగించేది.
ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ..కృష్ణార్పణం అన్న మాట విన్నది. అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది.
ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే..
bhagavan-lord-krishna-sri-krishna-krishnarpanam-ap-politica
లేవగానే కృష్ణార్పణం..పడుకొనేముందు కృష్ణార్పణం.. భుజించేముందు.. బోజనం తరువాత బయటకెళ్ళేముందు..ఇంటికొచ్చిన తరువాత... కృష్ణార్పణమే.
చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ కృష్ణార్పణం  అనటమే !  ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆఊరిలో కలకలం చెలరేగింది.  విషయమేమిటంటే ఆఊరిలో ఉన్న శ్రీకృష్ణదేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతీరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. 


ఎలాగో ఎవరికీ అర్ధం కాక నిఘాపెట్టారు ఊరి జనమందరి మీదా. చివరకు ఈ గొల్లస్త్రీ చెత్త ఊడ్చిపారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకేసమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆదేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటిరోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది.

bhagavan-lord-krishna-sri-krishna-krishnarpanam-ap-politica

నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా. ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ఆమె కటికనేలపై పడుకొనేముందు కృష్ణార్పణమనుకుంది. రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది. ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంతప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు.


ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అని అనగానే గాయం మాయ మయ్యింది.  అది చూసిన కారాగృహాధికారి పరుగు పరుగున రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. 
మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి  ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్నికట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వట్లేదు అని వాపోయారు.
రాజుగారు ఆ స్త్రీని అడిగారు. 

bhagavan-lord-krishna-sri-krishna-krishnarpanam-ap-politica

నీగాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని. తెలియదు నాకు అంది. సరే ఏదో మంత్రం చదివావట కదాఅని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.  సభలో వారందరూ హతాశులయ్యారు. ఆమెని నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా..అని అడిగితే, తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను.

అలా అనటం తప్పాండీ? ఆమంత్రం నేను జపించకూడదా?  ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. సభికులు పెద్దల కళ్ళల్లు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం  అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతిఘోరంగా రోదించడం మొదలెట్టింది.  అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామి వారి మీద చెత్త పోసాను.నాగాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. 


నాపాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది. చిరునవ్వులు రువ్వుతూన్న నందకిషోరుడుని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజునుంచీ శుద్ధిగా భోజనం వండి తినేముందు కృష్ణార్పణం. అనడం మొదలుపెట్టింది.  శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు.
ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలకు అంతమేముంటుంది?.


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు..!!


bhagavan-lord-krishna-sri-krishna-krishnarpanam-ap-politica
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.