మృగశిర 3 , 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారుమిధునరాశికి చెందును.
శ్రీ వికారి నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని సూచించుచున్నది.


మిధున రాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. ధనాదాయం బాగుండును. ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలసి రాదు. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఉద్యోగుల స్థానచలన ప్రయాతాలు విఫలమగును. అధికారుల వలన తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. విదేశీ వ్యవహారములందు విజయం ఏర్పడును. మంచి ఆలోచనలు చేయుట, మాట నిలకడ కలిగి ఉండుట వలన మంచి గుర్తింపు , గౌరవ మర్యాదలు పొందేదురు. కుటుంబ భాధ్యతలు చక్కగా నిర్వహించగలరు. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మక మార్పులకు ఈ సంవత్సరం కలసిరాదు. చేతి వృత్తి నిపుణులకు గడ్డుకాలం. విద్యార్ధులకు మంచి ఉత్తీర్ణతా ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి చక్కటి లాభాలు. భాగస్వామ్య వ్యవహరాదులు నష్ట పరచును. కుటుంబ తగాదాలు పరిష్కారం అగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు.


మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 03-నవంబర్-2019 వరకూ అనవసర తగాదాలు, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామితో తగాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. 04-నవంబర్-2019 నుండి సొంత ఆరోగ్య సమస్యలను కలుగచేయును. అవివాహితులకు అతి చక్కటి సంబంధాలు వచ్చునట్టు చేయును. అవివాహిత మగవారికి మిక్కిలి పతిభక్తి కలిగిన జీవిత భాగస్వామి లభించును. అయితే వక్తిగత జాతకంలో గురు గ్రహం పాప సంబంధం కలిగి , నీచ స్థానాలలో ఉన్న మిధున రాశి వారికీ ఆయుర్ధాయ భంగములకు సూచనలు కలవు.
మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మంచి ఫలితాలను ఇవ్వడు. 23-జనవరి-2020 వరకూ ఆర్ధికంగా మంచి ధనాదాయం కలుగచేయును. ప్రధమ కళత్ర నష్టం జరిగి, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి జీవిత భాగస్వామిని ఏర్పరచును. 24-జనవరి-2020 నుండి వారసత్వ పరంగా లభించిన భాగ్యంలో కొంత వ్యయం ఏర్పరచు సూచన. వ్యక్తిగతంగా పూర్ణ ఆయుర్దాయం కలుగచేయును.
మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మిశ్రమ ఫలితాలను కలగచేయును. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు , శరీర ధారుడ్య సమస్యలు వంటి సమస్యలు ఏర్పరచును.


ఏప్రిల్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఉన్నతికి మీ ప్రయత్నాలు సాగిస్తారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యం. ఉద్యోగ జీవనంలో స్వల్ప ఇబ్బందులు. చివరి నిమిషానికి కార్య విజయం పొందుదురు. వ్యాపారాదులు బాగా జరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధుల ఆశలు నెరవేరును. వివాహ మరియు సంతాన విషయాలలో ఆనందోత్సవాలు ఏర్పడును. విదేశియాన ప్రయత్నాలు తీవ్ర కృషి తరువాత ఫలించును. చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దుర్వార్త. ఈ మాసంలో 10, 24, 25, 26 తేదీలు అనుకూలమైనవి కాదు.
మే 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాస ప్రారంభంలో వాద వివాదాల వలన కొన్ని మానసిక సంఘర్షణకు సంబంధించిన సంఘటనలు. మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. ధనాదాయం సామాన్యం. అనుకోకుండా ఇతరుల పనులు మీకు కార్య భారంగా మారును. జూదానికి ఈ కాలం కలసిరాదు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అగును. 10 నుండి 18 వ తేదీల మధ్య ఏర్పడు నూతన పరిచయాల పట్ల లేదా చేయు భాగస్వామ్య వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శన చేయును. మిధున రాశికి చెందన స్త్రీలకు ఈ మాసంలో నూతన భాద్యతలు ఏర్పడును.


జూన్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో వైవాహిక జీవనంలో కొన్ని ప్రత్యెక వ్యతిరేక సంఘటనలు. భాత్రు వర్గం వారితో సమస్యలు. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. ధనాదాయం సామాన్యం. తరచుగా ప్రయాణాలు ఏర్పడును. వ్యుద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండవలెను. నూతన ఆలోచనా విధానం అలవాటు చేసుకొందురు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండుట వలన సమస్యలు ఏర్పరచుకోను సంఘటనలు. కుటుంబ పరమైన వ్యయం కొద్దిగా చేయిదాటును. రాజకీయ రంగం వారికి గౌరవ హాని సంఘటనలు. భూ సంబంధ క్రయవిక్రయాలు చేయువారికి ప్రభుత్వం వలన సమస్యలు.


జూలై 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో నూతన ఆదాయ మార్గం ఒకటి లభించు సూచనలు అధికం. దూర ప్రాంత ఆదాయం లభించును. గృహ నిర్మాణ పనులలో తీవ్ర ఆటంకములు. భూ వ్యాపారులకు సమస్యలు కొనసాగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. తృతియ వారంలో అనారోగ్యములతో ఇబ్బందులున్నాయి. పూర్వ కాలంలో ఇచ్చిన హామీల వలన కొన్ని చికాకులు. కుటుంబ లేదా స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుదురు. చివరి వారానికి సంతృప్తికరమైన పరిస్థితులు. కుటుంబ పెద్దల ద్వారా నూతన సమాచారం మరియు వారిచే గుర్తింపు పొందేదురు. ఈ మాసంలో 18, 19, 20 తేదీలు అనుకూలమైనవి కాదు.


ఆగష్టు 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో శుభకార్య సంబంధ లేదా వ్యక్తిగత జీవనం వలన పనిభారం అధికమగును. ఆరోగ్య విషయాలలో, ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్త అవసరం. బాగా ఎదిగిన సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేదురు. సంతానంతో పంతానికి పోకుండా ఉండుట మంచిది. ధనాదాయం కొంచెం తగ్గును. ప్రయాణాలు అంతగా ఫలవంతం అవ్వవు. ఈ మాసంలో 24 వ తేదీ నుండి 31 వ తేదీ వరకూ ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. శుభ కార్య ప్రయత్నాలకు మంచి కాలం.
సెప్టెంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉదర సంబంధమైన అనారోగ్యం వలన చికాకులు. మాట లేదా నింద పడు సంఘటనలు - అవమాన పడు సంఘటనలు. ధనాదాయం సామాన్యం. ఖర్చులు పెరిగినా సమయానికి ధనం చేతికి వచ్చును. దూర ప్రయాణాలు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. మనోవికాసానికి సమయం కేటాయించడం మంచిది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ మాసంలో పొందుట కష్టం. ఈ మాసంలో 4, 6, 9, 17, 28, 29 తేదీలు అనుకూలమైనవి కావు.


అక్టోబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ప్రధమ , ద్వితీయ వారాలలో తండ్రి వర్గం వారికి మంచిది కాదు. విరోధుల వలన మానసిక అశాంతి. వాహన సంబంధమైన సమస్య లేదా ప్రమాదం. స్త్రీల వలన ఆకస్మిక సమస్యలు. ఏకపక్ష నిర్ణయాల వలన సమస్యలు ఎక్కువ చేసుకోనుదురు. 15 వ తేదీ నుండి అనుకూల వార్తలు విందురు. కుటుంబ పరిస్థితులు చక్కబడును. విదేశీ ప్రయత్నాలు సఫలమగును. వైవాహిక జీవనంలో వివాదాలు కలిగిన వారికీ ఒక శుభ మార్పు. బంధుమిత్రులను దూరం చేసుకోకూడదు. నూతన వ్యాపారాలు ఆరంభం అగును.


నవంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ఆశించినంత ధనాదాయం ఉండును. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. నూతన పరిచయాలు, నూతన సంబంధాలు కలసి వచ్చును. వివాహ ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు సాగును. ఉద్యోగ జీవనంలో కోరుకొన్న ఉన్నతి ఏర్పడును. సహోద్యోగులతో వివేకంతో ప్రదర్సించెదురు. ఆకస్మిక ఫలవంతమగు ప్రయాణాలు ఉన్నవి. ప్రేమవ్యవహరాలు ఆర్ధికంగా నష్టపరచును. ఈ మాసంలో 13, 14, 15 తేదీలలో జీవిత భాగస్వామిని లేదా గురువులను లేదా స్నేహితులను ద్వేషించు పరిస్థితులు ఎదుర్కొందురు.


డిసెంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు లాభించును. నూతన వాహన కోర్కె సిద్ధించును. ధనాదాయం బాగుండును. వ్యవహరాదులను విజయవంతంగా పూర్తీ చేయగలరు. గత కాలంలో ఆపివేసిన పనులను తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైనది. సజ్జన సాంగత్యం ఏర్పడును. భాత్రు వర్గం వారి జీవన స్థిరత్వం కోసం ఆందోళన చెందేదురు. మీ సలహాలకు విలువ ఉండదు. సమయానుకూలంగా ప్రవర్తించి పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు. పెద్ద కష్టం లేకుండానే రావలసిన ధనం చేతికి వచ్చును. ఈ మాసంలో 8, 9, 10 తేదీలలో కుటుంబ పరమైన ఒక సమస్య ఏర్పడు సూచన.


జనవరి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన వ్యాపార , ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం బాగుండును. గృహంలో నూతన వస్తువల అమరిక ఏర్పడును. మానసిక ఆనందం పొందేదురు. ఆరోగ్యం కొద్దిపాటి ఒడిదుడుకులు కలిగించును. వారసత్వ లబ్ది పొందు సూచనలు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసిరావు. చివరివారంలో వ్యక్తిగత గౌరవం పెరుగును.
ఫిబ్రవరి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో విందు వినోదాలలో పాల్గొనేదురు. నూతన పనులకు రూపకల్పన చేయుదురు. వృత్తి ఉద్యోగ విషయాలలో అభివృద్ధి ఏర్పడును. కోరుకొన్న జీవిత మార్పులు ఏర్పడును. అందివచ్చిన అవకాశములను చక్కగా ఉపయోగించుకోగలరు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు లాభించును. ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 12, 14, 15, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు.


మార్చి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసం చక్కటి ఫలితాలను కలుగచేయును. తలపెట్టిన ప్రతీ ప్రయత్నం విజయవంతం అగును. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. కుటుంబంలో అనుకోని కలహాలకు సూచనలు ఉన్నవి. ద్వితీయ తృతీయ వారములలో అకాల భోజన ప్రాప్తి తన్మూలక అనారోగ్యం. చివరివారంలో చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు లభించును. ఒక నూతన పనియండు నిపుణత సాధించుటకు సూచనలు కలవు. వ్యాపార వ్యవహరాదులు కలసివచ్చును. ఆర్ధిక సంవత్సరం విజయవంతంగా పూర్తీ అగును. ఈ మాసంలో 9, 12, 13 తేదీలు ఆరోగ్య పరంగా మంచివి కాదు.




మరింత సమాచారం తెలుసుకోండి: