ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.


శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 02 రాజపూజ్యం - 05 అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "6". ఇది రాజకీయాలలో విజయాన్ని సూచించుచున్నది. రాజకీయ రంగంలోని వారికీ అభివృద్ధి ఏర్పడును.


కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. 23-జనవరి-2020 వరకూ ఉన్నతమైన జీవన మార్గమును, ప్రమోషన్లను , విదేశే ప్రయాణాలను, ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయమును ఏర్పరచును. ది.24-జనవరి-2020 నుండి కుంభరాశి వారికి ఎడున్నార సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమగును. అప్పటి వరకూ అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలసిరాదు. వృధా వ్యయమును, మానసిక అశాంతిని , ఆరోగ్య భంగములను ఏర్పరచును.


కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా విద్యార్ధులకు, వైద్యులు, ఇంజనీర్లు, ప్లీడర్లు మొదలగు వృత్తి ఆధార నిపుణలకు అత్యంత అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. సమాజంలో ఖ్యాతిని పెంపొందించును. న్యాయవంతంగా మిక్కిలి ధనార్జనను ఏర్పరచును.
కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు వలన సంతాన సంబంధ సమస్యలు ఏర్పడును. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలవంతం అగుట కష్టం. దైవ ఆశీస్సులు ఉండవలెను. రాహు - కేతువులు ఇరువురూ ఆర్ధికంగా అతి చక్కటి ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద కుంభరాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం ఆర్ధికంగా బాగా కలసి వచ్చును.


ఏప్రిల్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసం నూతన కార్యములు ఆరంభించుటకు మంచి ప్రోత్సాహకరంగా ఉండి లాభించును. విరోదులపై విజయం ఏర్పడును. కోర్టు కేసుల తీర్పులు అనుకూలంగా వచ్చును. ధనాదాయం బాగుండును. వ్యాపారాదులు చక్కటి లాభాలను కలుగచేసి ఆశించిన విధంగా ముందుకు సాగును. మాస ద్వితియార్ధంలో గౌరవ పురస్కారాలు లభించును. ఋణ బాధలు తొలగును. మిత్రు వర్గం నుండి దూరంగా ఉండటం మేలు. ప్రతిభకు గుర్తింపు ఏర్పడును. పై అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పొందుదురు.


మే 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుంటుంది. వ్యాపార, ఉద్యోగ , వృత్తి జీవనంలోని వారికి అనుకూలమైన ఫలితాలు కొనసాగును. రావలసిన ధనం సమయానికి అందును. వ్యక్తిగత , వైవాహిక జీవనములలో చక్కటి సంతోషపూరిత రోజులు ఏర్పడును. అవివాహితులకు , నిరుద్యోగులకు ఈ మాసం శుభవార్తలను కలుగచేయును. సమయానుకూలంగా పనులు పుర్తిఅగును. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందును. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. కుటుంబ సభ్యుల బాధలను పరిష్కారం చేయుదురు. అందరూ హర్షించే కార్యక్రమాలు చేస్తారు.


జూన్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన ప్రయత్నాలు ఫలించు గ్రహ గతులు కలవు. వ్యాపారాదులు సామాన్యంగా ఉండును. భాగస్వామ్య వ్యవహారాలకు ఇది మంచి కాలం. ఈ మాసంలో శ్వాస సంబంధ సమస్యలు బాధించు సూచన. తృతీయ వారంలో ఏదో ఒక విషయంలో మనస్థిమితం లోపించు పరిస్థితులు కలవు. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. కార్య దీక్ష లోపించును. మాసాంతానికి పరిస్థితులలో అనుకూలత ఏర్పడును. ఈ మాసంలో 8, 11, 15, 23, 28 తేదీలు అనుకూలమైనవి కావు.


జూలై 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ఆలోచనలలో వేగం కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఆ వేగం లోపిస్తుంది. ప్రణాళికాబద్ధమైన కార్యదీక్ష అవసరమగును. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. పెద్దలను లేదా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. ఆర్ధిక ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. నూతన భాధ్యతలు ఏర్పడును. ధార్మిక విషయాలందు ఆసక్తి పెరుగును.


ఆగష్టు 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో కుటుంబ విషయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉంటాయి. ఉద్యోగ కార్యాలయంలో వ్యతిరేక స్వభావం కల వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ధనాదాయం సామాన్యం. వ్యాపార వర్గం వారికి మందకొడి ఆర్జన. ఆశించిన స్థాయి వ్యాపారం ఉండదు. మాస ద్వితీయ భాగంలో వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల కలయిక ఇబ్బందులకు దారితియవచ్చు. ఈ మాసంలో జల ప్రయాణాలు చేయువారు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు జల సంబంధ ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.


సెప్టెంబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో గతకాలంలో గాడి తప్పిన వ్యాపార వ్యవహారాలు ఒక దారికి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం కలసి వచ్చును. ఉద్యోగ జీవనంలో మార్పులు ఆశిస్తున్న వారికి కూడా ఈ మాసం కలసి వచ్చును. నూతన పదవులు లభించును. ధనాదాయం సామాన్యం. స్త్రీలకు ఉదర సంబంధ అనారోగ్య సమస్యకు సూచనలు కలవు. మాసాంతంలో ఆత్మీయులతో సంతోష సమయం లేదా విహార యాత్రలకు అవకాశం. నూతన వాహనాల కొనుగోలుకు ఈ మాసం అనుకూలమైనది కాదు.


అక్టోబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో మేనమామ వర్గీయులకు మంచిది కాదు. వ్యాపార వ్యవహారాలు ధనాదాయం సామాన్యం. గృహ జీవనంలో కొద్దిపాటి అశాంతి, సౌఖ్యం తగ్గును. తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వాయిదా వేసిన పనులను పూర్తీ చేయగలుగుతారు. మాసం చివరి వారంలో దూర ప్రాంత ప్రయాణాలు. శారీరక అలసట. ఈ మాసంలో 13, 19, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.


నవంబెర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ఇష్ట దేవతా అనుగ్రహ ప్రాప్తి ఏర్పడును. స్వశక్తితో కార్యాలను పూర్తీ చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారాన్ని పొంది సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఒక పెద్ద పనిని పూర్తీ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఉద్యోగంలో కోరుకొన్న మార్పులు. సత్కారములు పొందుదురు. కుటుంబంలో శుభకార్యములు విజయవంతంగా నిర్వహిస్తారు.


డిసెంబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ఆర్ధిక విషయాలలో అభివృద్ధి క్రమానుగతంగా తగ్గును. వ్యాపార వ్యవహరాదులలో చిక్కులు ఏర్పడును. అదృష్టం కలసి రాదు. మంచి మంచి అవకాశములు కోల్పోవుదురు. సమస్యల పరిష్కారం కోసం ఇతరులను ఆశ్రయించవలసి వచ్చును. సరిహద్దు విషయాలలో సమస్యలు. అనవసర సామాగ్రి కొనుగోలు చేస్తారు. చివరి వారంలో శ్రమతో కూడిన జీవనం. నూతన ప్రయత్నాలు కలసిరావు. పాత మిత్రులు అవసరమగును.


జనవరి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో కుంభరాశి వారికి ఏలినాటి శని దశ ప్రారంభమగును. అభివృద్ధిలో వేగం తగ్గుముఖం పట్టును. జీవన మార్గంలో ఎదో ఒక అశాంతి లేదా అసంతృప్తి కలిగించు పరిస్థితులు ఏర్పడుచుండును. ధనాదాయం ఆశాజనకంగా ఉండదు. నూతన వ్యాపారాలు లేదా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ మాసం 19 వ తేదీ లోపున అమలు చేయవలెను. నూతన ఒప్పందాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. మిత్రుల మధ్య అభిప్రాయ బేదాలు. మాసాంతానికి రాబడికి మించి ఖర్చులు ఏర్పడును.


ఫిబ్రవరి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో వృధా వ్యయం అధికమగును. ఆర్ధిక ప్రణాళికలు అనుకున్న విధంగా పూర్తీ చేయలేరు. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందిని కలుగ చేయును. నమ్మక ద్రోహానికి లోనగు సంఘటనలు. ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం మంచిది. భూ సంబంధ క్రయవిక్రయాలు చేయకుండా ఉండుట మంచిది. గృహ నిర్మాణ సంబంధ విషయాలు అధిక వ్యయప్రయాసలు కలుగచేయును. ఈ మాసంలో 5, 12, 13 తేదీలు అనుకూలమైనవి కావు.


మార్చి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఎదిగిన సంతానమ వలన సమాజంలో గౌరవ హాని. పంతాలకు పోవుట వలన ఇబ్బందులు. గత మాసపు సమస్యలు కొనసాగును.



మరింత సమాచారం తెలుసుకోండి: