కళలు ప్రత్యేకించి లలిత కళల పరమార్ధం "దేహం (బాడీ) మనసు (మైండ్) ఆత్మ (సోల్)" మూడింటిని తదాత్మ్యత చెందించి ఐఖ్యం చేసి అమోఘమైన ఆనందాన్ని అందించటమే. అయితే అభినయం, వాచకం, ఆహార్య ప్రధానమైన నాట్యం బౌతికమైన ఆనందంతోపాటు పంచేంద్రియాలను ఉల్లాసపరచి ఉత్తేజం ఉత్సాహం కలిగిస్తుంది.


అయితే విభిన్ననాట్య రీతుల్లో విఖ్యాతి గాంచింది భరత మహాముని విరచిత "భరత నాట్యం" సాధారణంగా చెప్పుకునే నాట్య రీతులకు-భావ రాగ తాళాలను సమ్మిళిత సమన్వితం చెసేదే భరత నాట్యం. భరత నాట్యరీతిలోని “వర్ణం” అత్యంత అద్భుత విభాగం, విన్యాసం.


భరత నాట్యం ద్వారా మనోల్లాసమే కాదు, మనోవికాసం, దైహిక మానసిక వ్యాయామం కూడా అదనంగా సిద్ధిస్తాయి. అందుకే బాల్యం నుండే పసిపిల్లల బుడి బుడి అడుగులను నాడే భరత నాట్యంలో పాదాల పదనిసలు వేయిస్తే పసితనం నుండే వారికి మానసిక విస్తృతి, క్రమశిక్షణ, సమాజంలో పదుగురితో కలసి నడిచే జీవన సంస్కృతి అలవడతాయి. అదే పసివాదని నాడే పలు సామాజిక రుగ్మతల భారీన పడకుండా కాపాడే గురు సాహచర్యం లభిస్తుంది. అలా జరిగేలా చూడటం మానవ జాతి తొలి దైవాలైన మాతృ-పితృ దేవతల బాధ్యత. 


నిన్న (అంటే 17 ఏప్రిల్ 2019) రోజున అనుకోకుండా "శ్రీవారి పాదాలు" భరతనాట్య అకాడమీ (నర్తించే పాదాల్లో దైవత్వం దాగుందన్న భావన కలిగించే పేరు) వారి నాలుగవ వార్షికోత్సవాన్ని రవీంద్ర భారతి రసరమ్య వేదికపై తిలకించే అవకాశం దొరికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: