రోజా అంటే ఉపవాసం.. రంజాన్ రోజుల్లో ముస్లింలు 30 రోజులపాటు ఉదయం నంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు.  సాధారణంగా రంజాన్ ఒక సమయంలో ఫిక్స్డ్ గా రాదు. ఒక్కో ఏడాది ఒక్క నెలలో వస్తుంటుంది.  ఈ సంవత్సరం సమ్మర్ మాసంలో రంజాన్ వచ్చింది.  ఇలా సమ్మర్ రావడం వలన ఇబ్బందులు కలుగుతాయి.  మనదేశంలో ఎండలు ఎక్కువా ఉండటం ఇబ్బందికరం.  


ఇక నార్వే వంటి దేశాల్లో సమ్మర్ లో పగలు ఎక్కువగా ఉంటుంది.  ఒక్కోసారి 20 గంటల వరకు పగలు ఉంటుంది.  ఇలాంటి సమయంలో ఉపవాసం ఉండటం చాలా కష్టం. ఉపవాసం ఉండటం వలన శరీరానికి ఏం జరుగుతుంది.  ఉపవాసం చెయ్యొచ్చా చేయకూడదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  


మొదటి రెండు రోజులు చాలా కష్టంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న 8 గంటల తరువాత తిరిగి ఆహరం తీసుకోకపోతే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.  అందనంగా ఉండే కొవ్వు కరగడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  ఇది హెల్త్ కు మంచిదే.  మూడు నుంచి 7 రోజుల కాలంలో శరీరంలోని కొవ్వు అలవాటు అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.  కాకపోతే డి హైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.  విరమణ సమయంలో ఎక్కువగా ద్రవపదార్ధాలు తీసుకోవాలి.  


8 నుంచి 15 రోజుల మధ్య శరీరం ఉపవాసం చేయడానికి అలవాటు పడుతుంది.  కాబట్టి పెద్దగా ఆహరం తీసుకోకపోయినా అలసట ఉండదు.  ఇబ్బంది కలుగదు.  ఇక 16 నుంచి 30 రోజుల మధ్యకాలంలో శరీరం ఉపవాసానికి పూర్తిగా అలవాటు పడిపోతుంది.  శరీరంలోని కిడ్నీలు, ప్రేగులు, ఇతర అవయవాలు వ్యర్ధపదార్ధాలను శుద్ధి చేస్తుకుని పనిలో ఉంటాయి.  శరీరంలోని అవయవాలన్ని గరిష్ట స్థాయిలో పనిచేస్తాయి.  మెదడు చురుగ్గా ఉంటుంది.  ఆహరం నుంచి కాకుండా శరీరం ఇతర మార్గాల్లో ప్రోటీన్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.  కొన్ని నియమాలు పాటిస్తూ ఉపవాసం చేయడం మంచిదే అని డాక్టర్లు కూడా చెప్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: