ఈ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.  ఒక్కో చోట ఒక్కొక్కటి ప్రాచుర్యంలో ఉంటుంది.  ఎవరో ఎక్కడో ఎప్పుడో చెప్తే నమ్మే రోజులు పోయాయి.  కళ్లారా చూస్తేనే గాని నమ్మలేని పరిస్థితులు వచ్చాయి.  ఇందుకు ఓ ఉదాహరణ రామేశ్వరం దేవాలయం.  ఈ ఆలయ ప్రాంగణంలో 22 బావులు ఉన్నాయి.  


ఈ 22 బావుల్లోని నీటి రుచి ఒకేవిధంగా ఉండదు. కొన్నింటిలో తియ్యగా ఉంటె, మరికొన్నింటిలో ఉప్పగా ఉంటుంది.  కొన్ని బావుల్లో నీరు సాధారణంగా ఉంటాయి.  రామేశ్వరంలోను.. చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని బావుల్లో నీటి కొరత ఎప్పుడు ఉంటుంది.  ముఖ్యంగా వేసవిలో.   మండుటేసవిలో ఆయా ప్రాంతాల్లో నీరు దొరకడం చాలా కష్టం.  


ఇటీవల చెన్నైలో మంచినీరు కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు మొత్తంమీద ఎక్కడ నీటి ఎద్దడి ఉన్నా.. రామేశ్వరంలో మాత్రం నీరు పుష్కలంగా ఉండటం విశేషం.  అదీ రామేశ్వరం దేవాలయంలోని 22 బావుల్లో.  ఈ 22 బావుల్లో 365 రోజులు నీరు పుష్కలంగా ఉంటుంది.  అలా ఎందుకు ఉంటుంది అన్నది ఇప్పటికి అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయింది.  


ఈ వింతను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.  బావుల్లో పవిత్ర స్నానం చేస్తున్నారు.  ఎక్కడా చుక్క నీరు దొరక్కపోయినా.. ఇక్కడ ఎలా దొరుకుతుందో అర్ధంగాక భక్తులు ఆశ్చర్యపోతున్నారు.  ఎలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: