“చక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో

ఘాణీన సంవరో సాధు, సాధు జివ్హాయ సంవరో.

కాయేన సంవరో, సాధు వాచాయ సంవరో

మనసా సంవరో సాధు, సాధు సబ్బత్థ సంవరో”...... చూపులు, శబ్దాలు, వాసనలు, రుచులు, వాక్కులు, స్పర్శలపై, మనస్సుపై - వీటిలో దేనిపై అదుపు ఉన్నా మంచిదే. అంతేకాదు, అన్నింటిపై అదుపు ఉండడం మరీ మేలు. అదే జితేంద్రియం సాధించటం. 

Image result for పంచేంద్రియాలు

ఒక గ్రామంలో ఐదుగురు మిత్రులు ఉండేవారు. వారు భిక్షువులుగా జీవించాలని నిర్ణయించుకొని, భిక్షా దీక్ష తీసుకున్నారు. ఇంద్రియాల్ని జయించిన వాడే గొప్ప భిక్షువు కాబట్టి ఐదుగురూ ఇంద్రియాల్ని జయించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకరోజున ఐదుగురూ ఒకచోట సమావేశమై జితేంద్రియులు కావడానికి చేయాల్సిన కృషి గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో మొదటివాడు -


మిత్రులారా! పంచేంద్రియాల్లో మనం ఎక్కువ జ్ఞానం పొందేది కన్ను ద్వారానే. రంగూ, ఆకారాలను చూసి అది మనల్ని కోర్కెల వెంట పరుగులు తీయిస్తుంది. కాబట్టి ముందుగా మనం దృష్టి జ్ఞానాన్ని అదుపు చేసుకునే పనితో మన శిక్షణ ప్రారంభిద్దాం అన్నాడు.


లేదు మిత్రమా! కంటి కంటే చెవి ప్రమాదకరం. తీయని మాటలు విని మనల్ని మోసపుచ్చుతుంది. కాబట్టి శ్రవణేంద్రియ నియంత్రణతో ప్రారంభిద్దాం అన్నాడు రెండోవాడు.


కన్నూ, చెవి కంటే ముక్కు వల్ల కలిగే వాసనలు ప్రమాదకరం. సువాసనలు మత్తెక్కించి మన మనస్సుకి మైమరపు కలిగిస్తాయి. మనల్ని ఇంద్రియ లోలత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాసనల్ని దూరం చేసుకొనే విధంగా మన ఇంద్రియ నియంత్రణ శిక్షణ మొదలెడదాం అన్నాడు మూడోవాడు.


దానికి నాలుగోవాడు నవ్వి - మిత్రులారా! రస తృష్ణకు మించిన తృష్ణ లేదు. నాలుక అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. రుచుల వెంట పడిపోయి, భ్రష్టులై, భంగపడినవారు ఎందరో...కాబట్టి రసతృష్ణను అదుపు చేసుకోవడంతో మన పని ప్రారంభిద్దాం! తేలిగ్గా జితేంద్రియులం అవుదాం అన్నాడు.


మీరు నలుగురూ చెప్పింది బాగానే ఉంది. కానీ శరీరం మొత్తం ఆవరించిన ఇంద్రియం స్పర్శ జ్ఞానాన్ని కలిగించే చర్మం. స్పర్శ సుఖం అలవికాని ఆనందాన్ని రేకెత్తించి, మనల్ని త్వరగా పెడమార్గంలో పడేస్తుంది. కాబట్టి ముందు స్పర్శానుభూతులకు లోనుకాకుండా మన చిత్తాన్ని దృఢతరం చేసుకోవడం మేలు అన్నాడు ఐదోవాడు.

Related image

వారికి చిత్త ఏకాగ్రత కోసం, ఇంద్రియాల్ని అదుపు చేయడం కోసం సాధన ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తేలలేదు. ఎవరి వాదాలు వారికి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. కొన్నిరోజులు గడిచిపోయాయి. కానీ సాధన ఆగలేదు. ఈ సమస్య తేల్చుకోవాలని బుద్ధుని దగ్గరకు వచ్చారు. నమస్కరించి, తమ సాధన విషయం చెప్పారు. ఏ ఇంద్రి యాన్ని మొదటగా అదుపుచేయాలో సెలవియ్యండి అని విన్నవించుకున్నారు.


భిక్షువులారా! ఏ ఇంద్రిya నిగ్రహమైనా మంచిదే. మీకు ఏది ప్రాధాన్యం అనిపిస్తే ఆ ఇంద్రియ నిగ్రహంతోనే మొదలు పెట్టండి. ఒక ఇంద్రియాన్ని నిగ్రహించాక మిగిలిన ఇంద్రియ నిగ్రహాలు నెమ్మదిగా సాధించ గలుగుతారు. ఎక్కడ మొదలు పెట్టాలంటూ తర్జన భర్జనల కంటే ఒక సాధనని ఎక్కడో ఒకచోట మొదలు పెట్టడం మేలు. ఒక ఇంద్రియ నిగ్రహం మంచిదే. అన్ని ఇంద్రియ నిగ్రహాలు మరీ మంచిది.  వారు వారికి నచ్చిన విధంగా సాధన మొదలుపెట్టారు. చివరికి జితేంద్రియులు అయ్యారు.

చక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో

ఘాణీన సంవరో సాధు, సాధు జివ్హాయ సంవరో.

కాయేన సంవరో, సాధు వాచాయ సంవరో

మనసా సంవరో సాధు, సాధు సబ్బత్థ సంవరో

Image result for పంచేంద్రియాలు

మరింత సమాచారం తెలుసుకోండి: