భాగవతంలోని పంచసూక్తులు ఇవీ : 1. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాభిల జంతుఘ  సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. అన్ని జీవులయందు. ప్రాణులయందు దయ, కరుణ, ఓర్పు, సమదృష్టి, మైత్రి కలిగియుండడం వలన ఆ భగవంతుడు సంతుష్ఠుడయి అనుగ్రహిస్తాడు. ‘‘గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణాధమాత్  మైత్రీం సమానాదన్విచ్ఛేత్ నత తాపై రభియతే’’  గుణవంతులను చూసి సంతోషించడము, గుణ హీనులను చూసి జాలిపడడము, సమానులతో స్నేహం చేయడము వంటివి చేయడంవలన మనసు ఏ రకంగాను బాధపడదు.  ‘‘తతో దుస్సంగముత్సృజ్య సత్యు సజ్జేత బుద్దిమాన్’’ బుద్దిమంతులు సజ్జనునులతో స్నేహం చేయవలేను, దుష్టుల సాంగత్యాన్ని విడిచి పెట్టవలేను. ‘‘అన్నం హి ప్రాణినాం ప్రాణ: ఆర్తానాం శరణం త్యహమ్’’  జీవులకు అన్నమే ప్రాణమని గుర్తించవలేను.  దీనుడు దిక్కునేనే అని భగవంతుడు చెబుతున్నాడు.  ‘‘ధర్మోవిత్తం నృణాం ప్రేత్య’’ మృతి చెంది పరలోకానికి వెళ్లేవారికి నిజమైన ధనము ధర్మమే అని గుర్తించవలెను.  

మరింత సమాచారం తెలుసుకోండి: