అహో... అంటే ఒక గొప్ప ప్రశంశ. బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్య కశిపుడిని సంహరించేందుకు సగం మనిషి గాను, సగం సింహ రూపంలో అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెపుతారు. విష్ణువు యొక్క ఈ భయంకర రూపం చూసిన సకల దేవతలు ఆయనను గురించి " అహో ...ఎంత బలవంతుడు " అని కీర్తిన్చారట. జయ జయ ధ్వానాలు చేశారట. (ఒక అంతు లేని శక్తి అని అర్ధం) . అందుకని ఈ ప్రదేశానికి కాల క్రమేనా అహోబిలం / అహోబలం అనే పేరు వచ్చింది.
ప్రస్తుత అహోబిలం క్షేత్రం సీమాంధ్ర లోని కర్నూల్ జిల్లాలో , ఆళ్ళ గడ్డ మండలం లో కలదు.


ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళాలంటే, కర్నూల్, నంద్యాల్ మరియు హైదరాబాద్ నగరాల నుండి బస్సు లు లభిస్తాయి. ఈ ప్రదేశానికి రైలు మార్గం లేదు. సమీప రైలు స్టేషన్ నంద్యాల్ లో కలదు. ఇది బెంగుళూరు - వైజాగ్ రైలు మార్గంలో తగులుతుంది.ఒక పురాణ గాధ మేరకు ఈ పుణ్య ప్రదేశం లో విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామీ రాక్షసుల రాజైన హిరణ్యకసిపుడిని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు.

పురాణాలలో అహో బిలం గురించిన కీర్తనలు ఈ విధంగా సాగినవి. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం , నరసింహ పరమ దైవం, అహో బలం ....అహోబిలం క్షేత్రంలో నారసింహ దేవుడికి నిర్మించిన దేవాలయాలు వివిధ దిక్కులలో తొమ్మిది వరకూ నిర్మించినట్లు చెపుతారు. నల్లమల అడవులలో నిర్మించిన ఈ దేవాలయాలు అద్భుత శిల్ప శైలి కలిగి వున్నాయి.


ఇక్కడి కొన్ని దేవాలయాలు గుహలలో వుంటే మరి కొన్నిటికి ట్రెక్కింగ్ చేసి కొండలు ఎక్కాలి. మార్గంలో అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు. ట్రెక్కింగ్ కఠినం గా వుంటుంది సుమా !


మనిషి జీవితాన్ని నిర్ధారించే ఈ 9 గుహలను అత్యంత భక్తి శ్రద్ధలతో తమ శత్రు సంహారం కొరకు పూజించాలని నమ్ముతారు.ఈ ప్రదేశంలోని చుట్టూ కల నలమల కొండలను శ్రీ మహా విష్ణువు ఆసనమైన శేష పాన్పు తో పోలుస్తారు. తిరుపతి తిరుమల ప్రదేశ కొండలను ఆది శేషుని పడగ గాను, నల్లమల కొండలను ఆది శేషుడి మధ్య భాగంగాను, శ్రీశైల కొండలను ఆదిశేషుడి చివరి తోక గాను అభివర్ణిస్తారు.సగం మనిషి, సగం సింహం ఆకారం గల విష్ణువు స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన వెంటనే, దేవతలు 'అహో బిలం ...అహో బలం' అంటూ జయ జయ ధ్వనులు చేసారు. శ్రీ మహా విష్ణువు చీల్చు కొని వచ్చిన స్థంభం ఉక్కు అంత ద్రుడ మైనది అని భావిస్తారు.


అహోబిలం ను కింద అహోబిలం, పై అహోబిలం అని రెండు భాగాలుగా చెపుతారు. పైన నరసింహుడు ఉగ్ర రూపి గాను , కింద నరసింహుడు శాంత స్వరూపిగాను ఉంటాడని చెపుతారు. పురాణ గాఢ మేరకు శ్రీనివాసుడు తన కళ్యాణ సమయంలో స్వయంగా వచ్చి ఉగ్ర నరసింహుడిని దర్శనం చేసాడని, ఉగ్రమూర్తి ని చూసి సామాన్యులు భయపడుతున్నారని భావించి, ఆయనే స్వయంగా కొండ కింది భాగంలో శాంత నరసింహుడిని ప్రతిష్టించాడని చెపుతారు.
సాంప్రదాయం మేరకు భక్తులు ముందుగా కొండ కింది భాగంలో ఉన్న శాంత స్వరూపుడైన నరసింహ ను దర్శించి , ఆ తరువాత ఇక్కడ నుండి 8 కి. మీ. దూరంలో ఉన్న కొండపై కొలువైన ఉగ్ర నరసింహుడిని దర్శిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: