ఈ నెల 16 న గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం హిందువులు ఆషాడ పౌర్ణమిని వేద వ్యాసుని జయంతికి గుర్తుగా గురు పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే ఆ తరువాత ఎనిమిది  గంటల తేడాతో చంద్రగ్రహణం జరగబోతుంది. ఇలా కొన్ని గంటల తేడాతో రెండు సందర్భాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఇంతక ముందు జులై 12, 1870న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురుపొర్ణమి వచ్చాయి. 


మళ్ళీ ఇప్పుడు దాదాపు 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం రాబోతుంది. అయితే గురుపౌర్ణమి నాడు గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి.


పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి. గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: