ఎల్1 ఎల్2 ఎల్3  దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.  బ్రేక్ దర్శనాలలో లోపలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. సామాన్య భక్తులనూ త్వరగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాంకేతిక పరమైన అంశాలను సరిచేసి మరో రెండు మూడు రోజుల్లో అధికారులు అమలు చేస్తారని  చెప్పారు వైవి సుబ్బారెడ్డి. 

"దేవస్థానంలో వ్యవస్థల్లో అవకతవకలు కొన్ని అన్యాయాలు జరిగినయి అని గత ప్రభుత్వ కాలంలో కాని ఏ ప్రభుత్వ కాలంలో అయినా కానీ ఆరోపణలు ఉన్నాయి. అవన్ని ప్రక్షాలన చెసే కార్యక్రమం చేసి సామాన్య  భక్తుడికి పెద్ద పీట వేసి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించటడానికి ఏ మేరకు మార్పు లు అవసరం అవుతాయో ఆ మేరకు మార్పుల్ని చేయండి అని ఆ దేశాలు ఇవ్వడం జరిగింది దానికనుగుణంగానే ఎల్1 ఎల్2 ఎల్3  సిస్టం పై ద్రుష్టిపెట్టి పూర్తిస్థాయి లో అవగాహన కలిగించుకున్నాకే  మేము ఒక నిర్ణయానికి రావడం జరిగిందని"  వైవీ సుబ్బారెడ్డి గారు వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: