Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:03 am IST

Menu &Sections

Search

మీకు కావలసిందే.. ఇందులో ఉంది.. డోన్ట్ మిస్..!

మీకు కావలసిందే.. ఇందులో ఉంది.. డోన్ట్ మిస్..!
మీకు కావలసిందే.. ఇందులో ఉంది.. డోన్ట్ మిస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు ( సిగ్నల్స్ లేవు ).


ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది. ....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ? ఏమి చేస్తాడు .? ఆందోళన !.


అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది ." నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు ..


ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి .


అదొక చిన్న హోటల్ . కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది .


తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు . " అని రాసి ఉంది..


ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!


help
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ చేతికి ఎముక లేదా? - వారికి ఏడాదికి 24 వేలు !
షాకింగ్: జగన్ పార్టీలో చేరిన కృష్ణంరాజు !
సైరా చూసిన వెంకయ్య.. రామ్‌ చరణ్‌ గురించి స్పెషల్ కామెంట్స్
హైకోర్టులో గెలిచిన జగన్.. ఏపీకి ఫుల్ ఖుషీ.. !
ఆ డైరెక్టర్ బూతు ఛాటింగ్ చూపించిన లేడీ.. అసలేం జరిగిందంటే..?
రొమాంటిక్ లో రమ్యకృష్ణ - ఆకాష్ కు హిట్ దొరికినట్టేనా..?
ఆ డైరెక్టర్లు వరస్ట్ అంటున్న ఛోటా..?
జగన్ సొంత జిల్లాలో.. లక్ష ఎకరాలు హాంఫట్..?
తెదేపా మేనిఫెస్టో ఐదేళ్లకు చూడని పవనూ - జగన్ మీద మాత్రం ముక్కాటి మీదెందుకు ?
పవనా.. ఇఠా చేత్తే జనసేనెప్పుడు సెట్టవుద్దంటావ్ ?
సూపర్.. మహేశ్ బాబు.. రియల్ హీరో..?
కేసీఆర్ కు వెన్నుపోటు - సమ్మె వెనుక ఆ TRS నేతలు ?
కలకలం రేపుతున్న తె. విద్యార్థి వేదిక నాయకుల అరెస్టులు ..!
కాకరేపుతున్న హుజూర్ నగర్.. గులాబీ గుండెళ్లో రైళ్లు..!
ఆర్టీసీ సమ్మె, చర్చలు.. ఇప్పుడు ఆ ఎంపీయే కీలకం..?
కళ్లు లేకపోయినా.. కలెక్టర్ అయ్యింది..
ప్రీ స్కూళ్లలో చిన్నారులకు పరీక్షలు వద్దు !
శభాష్ జగన్.. ఆ మహిళలకు నిజంగా దేవుడే...?
ఖజానా ఖాళీ అవుతున్నా.. జగన్ ఎక్కడా తగ్గట్లేదుగా..?
ఏపీలో నేడే రైతు పండుగ.. హామీ కంటే ఎక్కువే ఇస్తున్న జగన్
జగన్ లక్ష కోట్లు.. చంద్రబాబు ఏడు లక్షల కోట్లు..?
ఈ టాబ్లెట్లు వాడుతున్నారా.. ఈ పని తప్పక చేయండి..!
రూ. 100 మందుతో పిల్లలు పుట్టిస్తా.. ఛాలెంజ్..!
తిరుపతి వెళ్తారు కదా.. ఏడు కొండల విశిష్టత తెలుసా..?
కేసీఆర్ అంటే పవన్ కల్యాణ్ కు అంత భయం ఎందుకో..?
ఇండియన్ సైంటిస్టులు గ్రేట్.. ప్లాస్టిక్ ను తినే బ్యాక్టీరియా కనిపెట్టారు
కేసీఆర్‌ కు మరో షాక్ : ఆర్టీసీ కార్మికులకు వారూ తోడయ్యారు..?
ఎంగేజ్‌మెంట్ ఓకే.. పెళ్లికి నో.. అమ్మాయి ఏంచేసిందంటే..!
పదో తరగతితోనే ఉద్యోగం.. జీతం రూ. 11190
విద్యాసంస్థలకు దసరా సెలవులు.. ఇదిగో క్లారిటీ..!
రామ్‌చరణ్ భార్యలోని ఈ కోణం మీకు తెలుసా...?
హైదరాబాద్ కు మరో అదిరిపోయే సంస్థ..!
డెరక్టర్ రవిబాబు నిజ జీవితంలో ఇంత శాడిస్టా..?
షాకింగ్: T ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. టెన్త్‌ చాలు..
జల కాలుష్యంపై పవన్ కల్యాణ్ ఆవేదన..!
పల్నాడు గురించి చంద్రబాబు చెప్పిందంతా అబద్దమేనా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..