స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో ఇండియా పాక్ కలిసున్న సమయంలో పాక్ లోని అనేక హిందూ ఆలయాలు వైభవోపేతంగా అన్నిరకాల కైంకర్యాలు అందుకునేవి.  భక్తులు తాకిడి ఎక్కువగా ఉండేది.  స్వతంత్రం తరువాత రెండు దేశాలు విడిపోయాయి.  ముస్లిం ఆధారిత దేశంగా పాకిస్తాన్ ఏర్పడింది.  పాక్ లోని ఎన్నో హిందూ దేవాలయాలు మూతపడ్డాయి.  చాలా చోట్ల  హిందూ దేవాలయంపై దాడులు జరిగాయి.  వాటి సంపాదనకు కొల్లగొట్టారు.  


ఇప్పుడు అక్కడ వందలాది దేవాలయాలు దీనావస్థలో ఉన్నాయి.  కనీసం రోజువారీ పూజా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నాయి.  ఎక్కడో కొన్ని దేవాలయాలు మినహా మిగతా అన్ని మూతపడ్డాయి.  శిధిలావస్థకు చేరుకున్నాయి.  ఇలా శిధిలావస్థకు  వాటిల్లో ఒకటి శావాలా తేజ్ సింహ్ దేవాలయం.  ఈ హిందూ దేవాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది.  


సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్‌లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం.. 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం మానేశారు. కళతప్పి ఈ దేవాలయం దీనావస్థకు చేరుకుంది.  ఎప్పటి నుంచో ఆ హిందూ దేవాలయాన్ని తెరవాలని ప్రభుత్వానికి అక్కడి హిందువులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.  


వారి విన్నపాలను పట్టించుకున్న అక్కడి ప్రభుత్వం ఎట్టకేలకు కనికరించి ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు నిధులు కేటాయించింది.  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ ఆలయాన్ని పునరుద్ధరణ చేసేందుకు కంకణం కట్టుకున్నారు.  అవసరమైన నిధులు సమకూర్చారు.  72 ఏళ్ల క్రితం మూసేసిన ఆ ఆలయాన్ని ప్రధాని ఆదేశాల మేరకు తిరిగి తెరిచారు.  ప్రస్తుతం ఆ ఆలయం పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఇలాగే ఆ దేశంలో ఇంకా ఎన్నో దేవాలయాలు శిధిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా తిరిగి తెరిస్తే.. వాటిని సందర్శించేందుకు పర్యాటకు వస్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: