ప్రతి రోజు ఎదో ఒక మంచి పని చేయాలనో లేదంటే జీవితంలో ఎదుగుదల కోసం ఏదైనా చేయాలనో అనుకుంటాం. అలా అనుకున్నప్పటికీ పనులు పూర్తవుతాయా అంటే కావు. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారిపోతాయి. వాయిదా పడటం అటుంచితే.. లేనిపోని తలనొప్పులు కొన్ని మీదపడుతుంటాయి. ఖచ్చితంగా పూర్తవుతుంది అనుకున్న పనికూడా పూర్తికాదు.

తేలికైన పనులు కూడా కొన్నిసార్లు పోలవరం ప్రాజెక్టులాగా మారిపోతాయి. దీనికి కారణం ఏంటి ..? ఎందుకు అలా జరుగుతుంది..? మార్పు సాధ్యం కదా అని ఆలోచిస్తే.. ఖచ్చితంగా సాధ్యమే.. కాకపొతే ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాలి. మార్పులు అంటే వాస్తు మార్పులు కాదు. ఇంట్లో వాడే వస్తువులను మార్పులు చేయాలి. అదెలాగో ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కత్తెర : ప్రతి ఇంట్లో ఈ వస్తువు తప్పనిసరిగా ఉంటుంది. వంటింట్లో ప్యాకెట్లు కట్ చేయడానికి కావొచ్చు. షేవింగ్ కిట్ లో కావొచ్చు లేదా ఇంట్లో కుట్టు మిషన్ ఉంటె బట్టల కోసం కావొచ్చు. తప్పనిసరిగా కత్తెర ఇంట్లో ఉంటుంది. అయితే, కత్తెరను ఎలా ఉపయోగిస్తారో మనకు తెలుసు. వాడిన తరువాత కత్తెర రెండు కొనలు విడివిడిగా ఉండే విధంగా ఉంచకూడదు. రెండు కొనలు దగ్గరగా ఉంచాలి. ఇలా ఉంచితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.

పగిలిన వస్తువులు: ఒకసారి ఇల్లు మొత్తం వెతకండి. మనకు ఎన్నిరకాల పగిలిన వస్తువులు కనిపిస్తాయో. అలా పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని బయట పడేయాలి. అలాగే ఇంట్లో ఉంచుకుంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.

చీపురు : చీపురు నేలపై ఉంచాలి. అంతేకాని నిలువుగా గోడకు ఆనించి పెట్టకూడదు. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉంటె వెంటనే బాగుచేయించండి. లేదంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఈమధ్యకాలంలో సెల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. ఆ సెల్ ఫోన్ తెర చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ తెర కొన్నికారణాల వలన పగిలిపోతుంది. దానిని పక్కన పడేసి మరొకటి కొంటాం. అయితే, పనిచేయని ఎలక్రానిక్ వస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దీనివలన కూడా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. కాబట్టి మీదగ్గర పనిచేయకుండా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైతే వెంటనే బాగుచేయించండి. లేదంటే బయటపడేయండి. ఇలా కనుక చేస్తే మీ ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. 100% జీవితంలో మార్పు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: