బక్రీద్ పండగ ఈ నె12వ తేదీనేనని రుయత్ ఎ హిలాల్ కమిటీ తేల్చి చెప్పింది. నెలవంక కన్పించిన పది రోజు లక ఈ పర్వదినాన్ని జరంపంకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలోనే మంగళవారం నెలవంక కన్నించిందనీ ఖ్వాజీ ముస్తక్ మదాని వెల్లడించారు. ముస్లీం సోదరులకు అతి పవిత్రమైన పండుగలలో బక్రీద్ ఒకటి. అటువంటి పండుగ ఎప్పుడు చేసుకోవాల అనే విషయం నెలవంక మీద ఆధారపడి ఉంటుంది. 


బక్రీద్ పండుగకు సంబంధించి నెలవంక శనివారం కనబడిందని నెలవంక కనబడ్డ 10రోజులకు బక్రీద్ పండుగను జరుపుకుంటాము. అంటే ఈ నెల 12 వ తేదీన జరుపుకోవాలని రుయత్ ఎ హిలాల్ కమిటీ సభ్యులు ఖ్వాజీ మోలానా ముస్తక్ మదాని తేల్చి చెప్పారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

ఈ రోజు నెలవంక కనబడింది కాబట్టి అందులో భాగంగా ఇవాల్టి నుండి సరిగ్గా 10 రోజులలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని తెలిపారు. కొన్ని క్యాలెండర్‌ లలో 12 వతేది అని మరికొన్ని క్యాలెండర్‌ లలో 13 తేదిగాను ఉందని మీరు ఎటువంటి అయోమయానికి గురికాకుండా 12వ తేదినే పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: