చాలామంది తమకు తగినంత డబ్బు లేదని బాధపడతారు. పొరుగువారికి ఉన్న సంపద చూసి ఈర్ష్యపడతారు. తమకూ డబ్బు ఉంటే బావుండేదనుకుంటారు. కానీ దేవుడు తమకు ఇచ్చిన అసలైన ఐశ్వర్యాలను చూసి ఆనందపడరు.. అదే మానవ నైజం..


ఇంతకీ మీరెంత ఐశ్వర్యవంతులో మీకు తెలుసా.. ఇదిగో నేను ఇప్పుడు చెబుతున్న ఐశ్వర్యాలు మీకెన్ని ఉన్నాయో లెక్కేసుకోండి.. మీకే తెలుస్తుంది.. ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?.. లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!..


ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు.. లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు...!.. ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం".. ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం".. ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"..


అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం... భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం".. పచ్చటి చెట్టు, పంట పొలాలు ఐశ్వర్యం.. వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం".. పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం".. మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం..


పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం".. ప్రకృతి అందం ఐశ్వర్యం.. పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం".. అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు "ఐశ్వర్యం.. బుద్ధి కలిగిన బిడ్డలు "ఐశ్వర్యం.. బిడ్డలకొచ్చే చదువు "ఐశ్వర్యం"..


భగవంతుడిచ్చిన ఆరోగ్యం "ఐశ్వర్యం .. చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి "ఐశ్వర్యం.. పరులకు సాయంచేసే మనసు మన "ఐశ్వర్యం.. ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు.. కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం..


మరింత సమాచారం తెలుసుకోండి: