గణపతి నవరాత్రోత్సవాల్లో విభిన్న రీతుల్లో మండపాలను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా గణేశుని ప్రతిమలను కూడా వైవిధ్యభరితంగా రూపొందించడం పరిపాటి. ఈ క్రమంలో కొందరు కూరగాయలతో, పండ్లతో తయారు చేస్తారు. మరికొందరు కరెన్సీ నోట్లతో, కాయిన్స్ తోనూ చేస్తారు. ఈ పరిణామక్రమంలో పాలకొండ  వాసులు కాస్త డిఫరెంట్గా ఆలోచించారనే చెప్పాలి. దీనిబట్టి చూస్తే అక్కడివాళ్లకు కాస్త సామజిక సృహ ఉండనే చెప్పాలి.  




శ్రీ
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఉన్న కాపు వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఈ కాస్త భిన్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఆయా నిర్వాహకులు ఈసారి  నెమలి పింఛంతో విగ్రహం ఏర్పాటు చేసేందుకు సంక్పలించారు. దానితో ఈ విగ్రహం పూర్తిగా నెమలి పింఛనులతో తయారు చెయ్యబడింది. సహజంగా వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ ఈ విగ్రహం మాత్రం పూర్తిగా రెండు లక్షలు పైగా ఉన్న నెమలి పించనాలతో తయారు చేశారు.ఇలాంటి విగ్రహం తయారు చేయడం దేశంలో మొదటిదిగా చెప్పవచ్చు. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా పరిగణించే ఈ ప్రాంతంలో సామాజిక సృహ కాస్త ఎక్కేనని చెప్పవచ్చు. 






భారీ మొత్తం ఖర్చుతో తయారు చేయబడ్డ ఈ నెమలి పింఛను గణనాధుడుని దర్శించుకోడానికి పాలకొండ ప్రాంత ప్రజలే కాకుండా, జిల్లాలో  ఉన్న అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తున్నారు.భక్తుల దర్శనార్థం కమిటీ వారు ప్రత్యక ఏర్పాట్లు చేశారు.గిన్నిస్ బుక్ లో నెమలి పించనుతో ఇంత పెద్ద భారీ వినాయకుడు రికార్డ్ లేని కారణంగా ,కమిటీ వారు గిన్నిస్ ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు ,భక్తులకు మంచి వాతావరణంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భవించవచ్చని భక్తులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: