గుడిలో అసలెందుకు ప్రదక్షిణలు చేయాలి అని తెలుసుకునే ముందు అసలు గుడికి ఎందుకు వెళ్లాలి అనేది తెలుసుకోవాలి. జనరల్‌గా మాట్లాడుకుంటే మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది.ఆడ-మగ,పెద్ద-చిన్న అనే తేడా లేకుండా గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు.ఎప్పుడైనా గుడికి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించుకు న్నారా?ప్రశ్నించు కుంటే చాల మందికి దొరికే సమాధానం కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా బాధలు ఉంటే మర్చిపోవడం కోసం అని.అది పొరపాటు. గుడికి వెళ్ళడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు.ఎందుకంటే ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనా లు చాలా ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం..రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్నగర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవా టు ఉన్నవారికి ఆ ప్రాంతంలో వున్న తరంగాలు శరీరంలోకి ప్రవహిస్తాయి.ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారి లో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు.కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుం ది..



ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి,ఒక్క వైపు మాత్రమే తెరిచి ఉంటుంది.అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది.గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.ఆ పాజిటివ్ శక్తి కూడా ముఖద్వారం దగ్గర నిలబడి దండం పెట్టడం వల్ల శరీరాన్ని తాకుతుంది.ఈ మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు,మంత్ర ఘోష,పూల పరిమళా లు,కర్పూరం,అగరు వత్తులు,గంధం,పసుపు,కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం,తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని ఎనర్జిని,మేలును చేకూరుస్తాయి.ఇక గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు,కర్పూర హారతి, అగరువత్తులు,గంధం,పసుపు,కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.



ఇలా గుడికి వెళ్లడం వల్ల భక్తులకు ఆనందం,ఆరోగ్యం లభిస్తాయి.మనలో దివ్య శక్తి ప్రవేశించి,ఎన్నో శక్తి తరంగాల్తో,వచ్చే తేజస్సు అనుభూతి కొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదని,శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.ఇక ప్రదక్షిణల విషయానికి వస్తే “ప్రదక్షిణం”లో “ప్ర”అనే అక్షరము పాపాలకి నాశనము ,“ద”అనగా కోరికలు తీర్చమని,“క్షి”అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది కాబట్టే పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి,పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు.కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షణ అవుతుంది.ఆత్మ ప్రదక్షిణ అవుతుంది.భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాని అర్థం వస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: