గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా నగరవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ తెలిపారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, రెవెన్యూ విషయాలపై ఓ అండ్ ఎమ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని గణేష్ నిమజ్జన యాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి మంచినీటి వసతి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం నగరంలోని 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలు ఏర్పాటుచేసి భక్తుల రద్దీకి అనుగుణంగా మంచినీటి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు.


మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి 30 లక్షల 52వేల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అలాగే అయా మంచినీటి శిబిరాల్లో భక్తులకు మంచినీటిని అందించేందుకు 24 గంటలు షిప్టుల వారీగా సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎండీ తెలిపారు.
వీటితో పాటు గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో మంచినీటి పైపులైనులో ఏవైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు  చేపట్టి  శోభాయాత్ర భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా  ఈ ప్రాంతాల్లో రాత్రి సమయాలల్లో ఎయిర్ టెక్ యంత్రాలతో ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న గల్లీల్లో సైతం సెవరెజీ పైపులైనును శుభ్రం చేయాలని మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా చూడాలని ఆదేశించారు. ఏవైనా మ్యాన్ హోళ్లు, మ్యాన్ హోళ్ల కవర్లు ధ్వంసం అయితే వెంటనే ఆయా మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరమ్మత్తు చేపట్టాలని సూచించారు. ఈ మంచినీటి వసతి గణేష్ నిమజ్జనం రోజు తెల్లవారుజామున 3గంటలకే ప్రారంభమవుతుందని తెలిపారు.




రద్దీని బట్టి కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో 48 గంటల పాటు మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ శిబిరాల్లో సరఫరా చేసే వాటర్ ప్యాకెట్ ల నాణ్యత విషయంలో రాజీపడోద్దని, ఐఎస్ఐ గుర్తింపు ఉన్న కంపెనీల నుంచే తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్రాగి పడేసిన మంచినీటి ప్యాకెట్లు, గ్లాసులను జీహెచ్ఎంసీ పారిశుద్ద్య సిబ్బంది సాయంతో ఎప్పటీకప్పుడు అక్కడ తొలగించాలని సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు . అజ్మీరా కృష్ణ,  పి. రవిలతో పాటు ఓ అండ్ ఎమ్ విభాగానికి చెందిన చీఫ్ జనరల్ మేనేజర్లు, జీఎమ్‌లు, డీజీఎమ్ లు, మేనేజర్లు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: