ఈ అవని ఎన్నో వింతలకు విశేషాలకు,అద్భుతాలకు పెట్టింది పేరు.ఇక్కడి పుడమిపైన జరిగే ప్రతి చర్య ఓ అద్భుతమే.అందుకే జన్మ ఎత్తితే మానవ జన్మే ఎత్తాలని అంటారు.ఎందుకంటే భూమి పైన జరుగే ప్రతి అద్భుతాన్ని అర్ధం చేసుకునే అవకాశం ఒక మనుషులకు మాత్రమే వుంది.కళ్ళముందున్న నమ్మలేని ఎన్నో సంఘటనలను ప్రత్యక్షంగా కాని పరోక్షంగా గాని అవగహన చేసుకునే ప్రాణి మనిషి మాత్రమే.ఇక ఈ భూమి మీద జరిగే ఓ మహత్యం కలిగిన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మనకు ప్రతి చోట,ప్రతి ప్రదేశంలో ఆలయాలు కనిపిస్తాయి.కాని అందులో కొన్ని ఆలయాలు మాత్రమే అద్భుతాలను చూపించగలవు.అవి ఎంతో మహత్యం కలిగి తన దగ్గరికి వచ్చే భక్తులకు తన్మయత్వం కలిగిస్తాయి.అలాంటి ఆలయమే మన రాష్ట్రంలో వుంది.



వరంగల్లు జిల్లా,పాలకుర్తి మండలంలోని స్టేషన్ ఘనాపూర్ కు 23కిలో మీటర్ల దూరం వున్న ఎత్తైన గుట్టమీద స్వయంభు సోమేశ్వరగుహాలయం,శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర గుహాలయం రెండు కలసి ప్రక్క ప్రక్కనే ఉండటం విశేషం.అందుకే ఈ క్షేత్రాన్ని క్షీరాద్రి క్షేత్రం అంటారు.ఇక ఇక్కడ వినిపించే నానుడి  క్షీరాద్రి శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని అంటారు..ఇలా అనడంలో ఓ అర్ధం వుందని చెబుతారు...ఇక ఇది పూర్వం ఓ  తపో భూమి.ఇక్కడ ఎందరో మహామునులు,రుషులు తపస్సు ఆచరించారట వారి తపోశక్తి వలన ఈ ప్రదేశం చాల మహిమగల భూమిగా మారిందని అంతే కాకుండా అర్థ రాత్రి ఇక్కడ వున్న ఆలయ గుహల నుండి ‘’ఓంకార నాదం’’ వినిపించి,విన్న ప్రతి వారిని తన్మయుల్ని చేయటం మరో విచిత్రం.అని తెలిపారు.ఇక ఇక్కడున్న  సోమేశ్వరుడిని అర్చిస్తే లక్ష రెట్ల అధిక ఫలితం వస్తుందని అచంచల విశ్వాసం.ప్రపంచానికి శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పే క్షేత్రం ఇది.



నరసింహస్వామి గుహనుండి ఉద్భవించే నీటి పాయ కొండ మీది కోనేటినుంచి అంతర్వాహినిగా ప్రవహించి ఈ గ్రామంలోని చెరువును చేరి‘’పాలేరు‘’గా మారి చివరికి గోదావరి నదిలో సంగమిస్తుంది.అందుకే ఇది పాలేరు పుట్టిన చోటు కనుక ‘’పాలకుర్తి’’ అయిందని నానుడి.మరో విషయమేంటంటే శివ కవులలో ముఖ్యుడైన పాలకుర్తి సోమనాధుడు ఇక్కడి వాడేనట ఈ ఆలయంలో శ్రావణ మాసంలో అయిదు రోజులు సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, నరసింహ స్వామికి లక్ష తులసీదళ పూజ,చేయడం తో పాటు లోకకల్యాణం కోసం రుద్ర స్వాహా కార పూర్వక శత చండీ యాగం కూడా జరిపిస్తారట ..

మరింత సమాచారం తెలుసుకోండి: