హిందు సంప్రదాయం ప్రకారం ఎవరైన చనిపోతే మూడవ రోజునుండి పదోవ రోజువరకు కాకులకు పిండం పెట్టడం చూస్తుంటాం.మరణించిన వారు కాకి రూపంలో కుంటుంబసభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం మన ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం.ఐతే ఈ ఆచారం వెనుక దాగున్న రహస్యమేంటో చాలమందికి తెలియదు,ఇదో కార్యక్రమంగా చేస్తారంతే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..



ఇంట్లో ఎవరైనా పెద్దలు,లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు కర్మకాండాలలో భాగంగా పిండంపెట్టి,కాకులకు అన్నం పెట్టడం ఆచారం.ఆ ఆహారాన్ని కాకులు తింటే పెద్దలు సంతృప్తి చెందారని అనుకుంటారు,ఒకవేళ కాకి ముట్టనట్లైతే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారందరు.ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.హిందు ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకు మనషులు ఏదో రకంగా సహాయం చేయాలి,అందుకే హిందూ కుంటుంబంలో చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు,కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు"ఇదం పిండంగృధ వాయస,జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"అనే మంత్రాన్ని చదువుతారు.గాలిలో విహరించే పక్షుల,నీటిలో నివసించే జలచరాల రూపంలో వుండే పితృ దేవతలకు ఆహారం అందించాలని ఆ మంత్రానికి అర్ధం.పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం..



ఇకపోతే పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవట,అందుకే మన పూర్వికులు పిండప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారం పెట్టేవారు,అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చిందని చెబుతారు.ఇక పురాణాలను పరిశీలిస్తే చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో కూడ వుందట.రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తూ వుంటారు కాబట్టి కాకులకు ఆహారం పెడితే నీ పూర్వికులకు చేరుతుందని వరం ఇస్తాడట.ఆ మాట ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ప్రచారంలో వుంది.ఇక చనిపోయిన వారి ఆస్దికలని నది దగ్గరకు వెళ్లి పిండప్రదానం చేసి, నదిలో వదిలేస్తారు.ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం..

మరింత సమాచారం తెలుసుకోండి: