తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ తెలిపారు. నగరవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో ఈ శిబిరాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని గణేష్ నిమజ్జన యాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి మంచినీటి వసతి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం నగరంలోని 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను  ఏర్పాటు చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా మంచినీటి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు.



మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి 30 లక్షల 52వేల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అలాగే అయా మంచినీటి శిబిరాల్లో భక్తులకు మంచినీటిని అందించేందుకు 24 గంటలు షిప్టుల వారీగా సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎండీ తెలిపారు.
వీటితో పాటు గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో మంచినీటి పైపులైనులో ఏవైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు  చేపట్టి  శోభాయాత్ర భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా ప్రాంతాల్లో రాత్రి సమయాలల్లో ఎయిర్ టెక్ యంత్రాలతో సెవరెజీ పైపులైనును శుభ్రం చేయనున్నామని చెప్పారు. 




ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న గల్లీల్లో సైతం సెవరెజీ పైపులైన్లను క్లిన్  చేయాలన్నారు. దీనితో పాటుగా  మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా చూడాలని అధికారులను అయన ఆదేశించారు. ఈ మంచినీటి వసతి గణేష్ నిమజ్జనం రోజు తెల్లవారుజామున 3గంటలకే ప్రారంభమవుతుందని తెలిపారు. రద్దీని బట్టి కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో 48 గంటల పాటు మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. అలాగే ట్యాంక్ బండ్ పై రోటరీ పార్కు, సర్వేపల్లి రాధాక్రిష్ణ విగ్రహం, నన్నయ్య విగ్రహం, జాషువా విగ్రహం, పోలీసు ఔట్ పోస్టు, ఎన్టీఆర్ గార్డెన్ ఇరువైపులా రెండు, ప్రసాద్ ఐమాక్స్ ఇందిరా గాంధీవిగ్రహం దగ్గర మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: