దీపం అంటే ఏమిటి.అసలు దీపారాధనకు మనిషికి వున్న సంబంధమేంటి.అసలు దీపం ఎందుకు వెలిగించాలి అనే విషయం మనలో చాల తక్కువ మందికి తెలుసు.భక్తి వున్న భక్తులు ఎందరో పొద్దున దీపారాధన చేస్తారు కాని ఆ ఆరాధన ఎందుకు చేస్తున్నారో తెలుసుకోరు అలాంటి వారి కోసమే ఈ విషయం.ఇక దీపం ప్రాణానికి ప్రతీక.దీపం జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం.అందుకే దేవుడికి పూజచేసేప్పుడు ముందుగా దీపంవెలిగిస్తారు.ఆ వెలిగించటాన్ని దీపారాధ అంటాం.ముందు గా,దేవుడిని ఆరాధించటానికంటే మొదట దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్నమాట.షోడశోపచారాలలో దీపంవెలిగించడం కూడా ప్రధానమైనది.



మనిషి తన జీవితంలో అన్ని ఉపచారాలు చేయలేక పోయినా కనీసం ధూప,దీప నైవేద్యం అయినా తప్పవు.దీపం అంటే అగ్ని.ఆ అగ్నినే వెలుగు,కాంతి, జ్ఞానం,ఆశ,ప్రాణం. అంటారు.దీపం వెలిగించడమంటే వెలుగుతో ప్రాణం పోయడమే.అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు.అంతేకాకుండా ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేస్తారు.లోకాలకి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని,శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట.శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం.అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు.ఇక దీపాన్ని, దీపమే కదా అని తీసేయడానికి వీలు లేదు.ఎందుకంటే కష్టాలలో దిక్కు తోచని స్దితిలో ఉన్నప్పుడు కాపాడేది కూడా దీపారాధనే.మరి ఎలా దీపారాధన చేస్తే ఆపదలో వున్నవారు రక్షింపబడుతారో తెలుసుకుందాం..



మనిషి తన జీవితంలో విపరీతమైన కష్టాలు ఏర్పడి,దిక్కుతోచని స్దితిలో వున్నప్పుడు.దుర్గాదేవి దేవాలయంలో 14రోజులపాటు ప్రదోషకాలంలో అమ్మవారి ఎదురుగుండా పసుపురంగు గుడ్దమీద మేలిమి గంధం,పసుపు,కుంకుమపొడి చల్లి,దానిమీద మట్టి ప్రమిదపెట్టి ఆ ప్రమిదలో ఆవనూనెతో ఒక వత్తి వేసి.తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి.అంతేకాకుండా దుర్గాదేవి ప్రీతికోసం చీర,రవికల గుడ్డ,గాజులు,పువ్వులు అన్నీ ఎరుపు రంగులో ఉండేవి దానం ఇవ్వాలి.దీని ద్వారా శక్తి సామర్ద్యాలు,ధైర్యం పెరిగి,కార్యసిద్ది కలుగుతుంది.ఇక వాహన ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నప్పుడు,8 బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయంపాకం దానంగా ఇచ్చి,ఆ ఆలయంలో మట్టి ప్రమిదలో ఆవునెయ్యిపోసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి..ఇలా చేస్తే తప్పక మీకున్న ఇబ్బందులు తొలగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: