పితృ పక్షాలు,మహాలయ దినాలు,మహాలయ అమావాస్య,అనే మాటలని మనం తరచుగా వింటుంటాం.“పిత్రు” అనే శబ్దానికి “పితరులు,పితృదేవతలు”అని అర్థం.మరణించిన మనపెద్దలు అంటే...తల్లిదండ్రులు,తాత అవ్వలు మొదలైన వారందరూ, పితృదేవతలు గా పరిగణించబడతారు.సహజంగా పితృ దేవతలకి,సంవత్సరానికి ఒక రోజున,వారు మరణించిన తిథి రోజున, తర్పణాలు ఇవ్వడం పరిపాటి.అంతేకాకుండా కొన్ని సాంప్రదాయ కుటుంబాలలో,ప్రతి నెల అమావాస్య రోజున “ఈ కార్యక్రమాలు” నిర్వహిస్తారు.ఇవి కాక,ప్రతి సంవత్సరం భాద్రపద మాసం “కృష్ణ పక్షాన్ని” పితృపక్షంగా వ్యవహరిస్తారు. పక్షం అంటే పదిహేను రోజులు.ఈ పక్షాన్ని పితృదేవతల కోసమే నిర్దేశించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి.హిందూ ధర్మం ప్రకారం,యజ్ఞయాగాదులు.తీర్థయాత్రలు చేయడంవల్ల,దేవ రుణం తీరుతుంది.వేదాలు ,శాస్త్రాలు,పురాణాలు ఇతిహాసాలు పట్టించడం వల్ల,సత్పురుషుల ఉపన్యాసాలు వినడం వల్ల,ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించడం వల్ల రుషి రుణం తీరుతుంది.



బ్రతికి ఉన్న తల్లిదండ్రుల్ని,తాత అవ్వలను ప్రేమగా..వారి ఆలనాపాలనా చూడాలి.అంతేకాక,వారు మరణించిన తర్వాత, వారు పిత్రు లోకాలలో స్థానం సంపాదించడం కోసం, పున్నామనరకం నుండి వారు,రక్షింపబడడం కోసం,మనము వారికి “పితృ తర్పణాలు ఇచ్చి” పితృ రుణం తీర్చుకోవాలి.ఈ సంవత్సరం 2019,ఈ సెప్టెంబర్ నెల 14వ తేదీ శనివారం,పౌర్ణమి నుండి 28వ తేదీ శనివారం వచ్చే,మహాలయ అమావాస్య వరకు” పితృ పక్షాలు రాబోతున్నాయి.ఈ పదిహేను రోజుల దినాలలో, మన పితృదేవతలు ఆకలి దప్పిక లతో,మన నివాస స్థలాల చెంతకు వచ్చి సంచరిస్తారు.కాబట్టి,ఈ మహాలయ పక్షాలలో రోజు పితృదేవతలకి“తిల తర్పణం”కార్యక్రమాలు చేయవచ్చును.వీలుకానివారు, ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు తర్పణాలు ఇవ్వవచ్చు.అది కూడా చేయలేనివారు,పితృ పక్షం చివరిరోజైన“మహాలయ అమావాస్య రోజున”తప్పనిసరిగా తర్పణాలు ఇస్తే, పితృదేవతలు సంతోషిస్తారు.ఇక విధవ స్త్రీలు,మరణించిన భర్త కు,తర్పణం ఇవ్వాలనుకుంటే,తన భర్తతో పాటు,అత్త మామలకు కూడా తప్పక తర్పణం ఇవ్వాలి.



ఈ కార్యక్రమాలు“పుణ్యతీర్థంలో గాని,గయ ప్రయాగ,కాశీ రామేశ్వరం వంటి ”విశేష స్థలముల నందు గాని,మీవున్న యింటిలో గాని,బావులు నదులు చెరువుల దగ్గర గాని,ఈ పితృ తర్పణం కార్యక్రమాలు చేయవచ్చును.బ్రాహ్మణోత్తములు అయిన పురోహితుల చేత ఈ కార్యక్రమం నిర్వర్తించే శక్తి లేనివారు, స్వతహగా ఎవరికి వారే,ఈ కార్యక్రమం నిర్వర్తించవచ్చు.ఇక పితృ దేవతలను ఒక్కొక్కరిని,గోత్రనామాలతో తలచుకుంటు సంకల్పం చెప్పుకుని,వారి గుణగణాలను స్మరించుకుంటూ, వారికి నచ్చిన ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పించి,తిల తర్పణం.పిండప్రదానం చేయాలి.ఆ ప్రసాదాన్ని,నీటిలోగాని, అగ్నికి గాని,ఆవులకు, కాకులకు,సమర్పించాలి.ఆ రోజున పితృదేవతల పేరు మీదుగా,పేదలకి,పేద బ్రాహ్మణులకు అన్నవస్త్రాలు, పండ్లు పలహారాలు దానం చేయాలి.ఇలా వారి వారి శక్తి మేరకు,ఈ పితృ పక్షదినాలలో,తమ పితృదేవతలకి తర్పణాలుఇచ్చి, వారి పేరు మీదుగా దానాలు చేసి,పితృదేవతల ఆశీస్సులు పొంది,వారి ఆత్మలకు శాంతిని చేకూర్చాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: