సాధార‌ణంగా ఉంగ‌రాల‌లో చాలా ర‌కాలు ఉన్నాయి. బంగారం, వెండి మాత్ర‌మే కాక రాగితో కూడా ఉంగ‌రాలు త‌యారు చేస్తారు. అయితే బంగారం వెండి కంటే చేతి వేలికి రాగి ఉంగరం పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స‌హ‌జంగా రాగి ప్రాత‌లో నీళ్ళు తాగ‌డం వ‌ల్ల చాలా మంచిది అని వింటుంటాం. రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీరే కాదు, రాగితో చేసిన ఉంగ‌రం, బ్రేస్‌లెట్‌, చెయిన్ వంటి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించినా దాంతో మ‌న‌కు ఎంతగానో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా...


- రాగి ఆభ‌ర‌ణాలను ధ‌రించడం వ‌ల్ల వాటిలో ఉండే రాగి అణువులు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్మం ద్వారా శ‌రీరంలోకి వెళ్తూ ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర మిన‌రల్స్ కూడా స‌క్ర‌మంగా అందుతాయి.


- రాగి ఉంగ‌రం ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. దీంతో మంచి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.


- కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. దాంతో వ్యాధి నిరోధకత పెరుగుతుంది.


- బీపీ  కంట్రోల్‌లో ఉంటుంది. గుండె కొట్టుకోవ‌డం స‌హ‌జ ప్ర‌క్రియ‌లో, సాధార‌ణ రేటులో జ‌రుగుతుంది. దీంతో గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంది చెడును తొలగిస్తుంది. అలాగే రాగి ఉంగ‌రం ధ‌రించ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంచుతుంది.


- కాపర్ శరీరంను కూల్ గా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతుంది. లోయర్ హైబిపితో బాధపడుతుంటే కాపర్ రింగ్ వేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: