దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభోపేతంగా ఆదివారం మొదలయ్యాయి. దీనితో ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. 


కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 




తొమ్మిది రోజులు నవ    దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు  దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులలో  రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి.  రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ   జరుగుతుంది. దేవి అర్చనలో లలితా  సహస్రనామాలు,  దుర్గాసప్తశతి పారాయణ చేసే  భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో  బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం  ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: