నిన్న‌టి నుంచి ద‌స‌రా సంద‌డి మొద‌లైంది. దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.


అయితే కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత... భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. మరి ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుందాం.


తొలిరోజు - శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి, పొంగల్.. రెండో రోజు - గాయత్రీ దేవి, పులిహోర‌.. మూడో రోజు - అన్నపూర్ణా దేవి, కొబ్బరి అన్నం.. నాల్గో రోజు - కాత్యాయని దేవి, అల్లం గారెలు.. ఐదో రోజు - లలితా దేవి, దద్ధోజనం.. ఆరో రోజు - శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి.. ఏడో రోజు - మహా సరస్వతి దేవి, కదంబం.. ఎనిమిదో రోజు - మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం.. తొమ్మిదో రోజు - రాజరాజేశ్వర దేవి, పరమాన్నం సమర్పిస్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: