రాష్ట్రం వ్యాప్తంగా 28 దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. కోటి నుంచి ఐదు కోట్లు, అలాగే ఐదు నుంచి 20 కోట్లు వార్షికాదాయం ఉన్న అన్ని దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ  నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూ ధార్మిక సంస్థళు, ట్రస్టుల చట్టం 1987 నూతన సవరణ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.



శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, నెల్లిమర్ల లోని రామస్వామి ఆలయం , విశాఖ జిల్లా  అనకాపల్లి నూకాంబికా ఆలయం , కాకినాడ లోని ఎం.ఎస్.ఎన్ చారిటీస్ సంస్థకు, అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ,  తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మండేశ్వర స్వామి ఆలయం,  వడ్డేపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం , గుంటూరు లాలాపేట లోని జగన్నాధ, ఆంజనేయ, వెంకటేశ్వర ఆలయం,  అదిగొప్పల లోని నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అమరావతి లోని అమరేశ్వరస్వామి ఆలయం, మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి, ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం. 




ఒంగోలు లోని ప్రసన్న చెన్నకేశవ ఆలయం, టంగుటూరులోని వల్లూరమ్మ అమ్మవారి ఆలయం, మిట్టపాలెంలోని శ్రీనారాయణ స్వామి ఆలయం.   నెల్లూరు జిల్లా జొన్నవాడ లోని మల్లిఖార్జున కామాక్షి తాయి ఆలయం, దుర్గామిట్ట లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం,  సూళ్లురుపేటలోని చెంగాళ్లమ్మ పరమేశ్వరి ఆలయం, నర్రవాడ లోని వెంగమాంబ పేరంటాళ్లమ్మ ఆలయం ,  మత్యాలమ్మ ఆలయం, రాయచోటిలోని వీరభద్ర స్వామి ఆలయం , చిత్తూరులోని అరగొండ ఆర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం , తిరుపతిలోని తాతయ్య గుంట గంగానమ్మ వారి ఆలయం, అనంతపురం జిల్లా వెంటికటి ఆంజనేయుని ఆలయం, అనంతపురం జిల్లా కదిరి లక్ష్మి నరసింహాలయం, చిత్తూరు జిల్లా దిగువపల్లి బోయకుంట గంగమ్మాలయం  పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: