సాధార‌ణంగా బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. దేవాలయాల్లో దైవాన్ని దర్శించుకునేటప్పుడు.. భక్తులు పూజ చేసేటప్పుడు.. బొట్టు పెట్టుకుంటారు. కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.


అలాగే ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచమూ హిందూ సంప్రదాయం. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే కుడిచేతి ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంద‌ట‌. సూర్యునిలో ఉన్న శక్తి మనకు లభిస్తుంది. మధ్యవేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.  బొటనవేలితో బొట్టు పెట్టుకున్న వారికి శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయ‌ట‌.


ఇక చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మన శరీరంలో మొత్తం 13 స్థానాల్లో బొట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థానం అంగారకుడిది. ఆయనకు ఎరుపు అంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బొట్టును చాలా మంది పెట్టుకుంటారు. అలాగే ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: