భార‌తీయ సంప్ర‌దాయంలో ముఖ్యంగా ద‌క్షిణాదిలో అర‌టిఆకుల‌లో భోజ‌నం చేస్తుంటారు. ఇది ఒక సంప్ర‌దాయంగా పాటిస్తుంటారు. అయితే అస‌లు అర‌టి ఆకులోనే భోజ‌నం ఎందుకు చేస్తారు? అన్న ప్ర‌శ్న చాలా మందికే వ‌చ్చి ఉంటుంది. అయితే దానికి స‌మాదాన‌మే ఇది. వాస్త‌వానికి అన్ని సంప్ర‌దాయ‌ల వెన‌క ఓ అర్థం ఉంటుంది. మ‌రి అర‌టిఆకులో భోజనం చేయం వెన‌క కూడా ఓ అర్థం ఉంది. అరటిఆకులో భోజనం చేయడం లేదా పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది.


అర‌టి ఆకులు  విషాహారాన్ని , క‌లుషిత ఆహారాన్ని గ్రహించే శ‌క్తి ఉంది. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. అంతే కాదు అర‌టి ఆకులో వేడి వేడి అన్నం, ప‌ప్పు, నెయ్యి .. త‌దిత‌ర వంట‌కాల‌ను వ‌డ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించ‌డం అసాధ్యం.  ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున ఆహారానికి మంచి రుచిని కలిగిస్తాయి. అదే విధంగా పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి.


అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే అర‌టి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. పూర్వం శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి. ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా.. అర‌టిఆకులో భోజనం చేయడం శ్రేయస్కరం.



మరింత సమాచారం తెలుసుకోండి: