హైందవ జాతికి  ఆది పరాశక్తి స్వరూపం "అమ్మ" దేవత. అమ్మే సర్వపాపహరిణి. అన్నిటికీ ఆమే కర్త కర్మ క్రియ. అందుకే హిందుమతావలంబకులు ఒక సంవత్సర కాలంలో ఐదు కాలాల్లో ఆమెను పూజిస్తారు. వసంత కాలం మరియు శరత్కాలం ప్రారంభమే వాతావరణలో సౌరప్రభావం మూలంగా అనేక మార్పులు వచ్చేస్తాయి. ఈ సంధికాలం, త్రిదేవతామణుల్లోని పార్వతీ స్వరూపాలను లేదా దేవీమాతను పూజించడానికి చాలా పవిత్రమైన అవకాశంగా భావిస్తారు. 

Image result for లక్ష్మి సరస్వతి పార్వతి


హిందూమత విశ్వాసులు ఒక సర్వశక్తిమంతమైన దేవతామాతను "అమ్మ" గా నమ్ముతారు. పూజించే విషయంలో ఆ దైవాన్ని బహురకాలుగా వ్యక్తీకరించబడి తమకు నచ్చిన రూపంలో పూజించటం అనాదిగా వస్తుంది. ఈ అనేక రూపాలు తమదైన సాంప్రదాయక సాంస్కృతుల మేళవింపుతో  దేశమంతా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దుర్గాదేవి, శక్తి ఆకృతిలో తనకుతానై వ్యక్తీకరించబడిన దేవత (శక్తి లేదా బలము). దసహరా అంటే పది రోజులు ఇది వాడుక భాషలో దసరా అవుతుంది. 


నవరాత్రి పండుగ లేదా 'తొమ్మిది రాత్రుల పండుగ, చివరి పర్వదినాన, అంటే పదవరోజున అత్యంత శొభాయమానం సంతరించుకొని విజయదశమిగా చారిత్రక ప్రాశస్త్యాన్ని పోందింది. తరతరాలుగా ఈ 'పది రోజుల పండుగ' ఆచారంగా మారింది. ఈ పది దినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గామాత యొక్క అనేక రూపాల ను ఆరాధనతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.


Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LAKSHMI' target='_blank' title='లక్ష్మి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లక్ష్మి</a> సరస్వతి పార్వతి

నవరాత్రిని సంవత్సరంలో ఐదు ప్రత్యేక ఋతు సంధి సమయాల్లో జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి,  శరన్నవరాత్రి, పౌష్య-మాఘ నవరాత్రి మరియు మాఘ నవరాత్రి అంటారు. వీటిలో వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి, శరత్కాలంలో వచ్చే శరన్నవరాత్రి లేదా శారదా నవరాత్రి  చాలా ముఖ్యమైనవి.


వసంత నవరాత్రిత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో మార్చి-ఏప్రిల్   తొమ్మిది రూపాల శక్తి మాతని ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.


ఆషాఢ నవరాత్రి : ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో జూన్-జులై --- తొమ్మిది రూపాల శక్తిమాతను పూజించడానికి అంకితం చేసిన తొమ్మిదిరోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LAKSHMI' target='_blank' title='లక్ష్మి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లక్ష్మి</a> సరస్వతి పార్వతి-త్రిశక్తి మంత్ర

శరన్నవరాత్రులు : అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. ఇదే సర్వమానవాళికి విజయాలను అందించే మహానవరాత్రి అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్వయుజ మాసంలో జరుపు కుంటారు. శరత్కాలంలో వస్తుంది కాబట్టి, దీన్ని శరన్నవరాత్రులుగా పిలుస్తారు. శరద్ ఋతువు శీతాకాలం మొదట్లో అంటే సెప్టెంబరు-అక్టోబరులో ప్రవేశిస్తుంది 


పౌష్య నవరాత్రి : పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తిని పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో  డిసెంబరు-జనవరి -- వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకుంటాడు కదా! అందుకే పౌష్య నవరాత్రులుగా జరుపుకుంటారు.


మాఘ నవరాత్రి : మాఘ మాసంలో జనవరి-ఫిబ్రవరి--- తొమ్మిది రూపాలలో శక్తి స్వరూపిణి దేవీమాతను తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగ గా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన అదీ కూడా చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయమే.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LAKSHMI' target='_blank' title='లక్ష్మి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లక్ష్మి</a> సరస్వతి పార్వతి

మరింత సమాచారం తెలుసుకోండి: