సాధార‌ణంగా కొంద‌రు గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంటారు. గడపకు పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయన్న‌ సంగతి అంద‌రికీ తెలిసిందే. కానీ గ‌డ‌ప‌కు ప‌సుపు రాయ‌డం వెన‌క చాలా మందికి కొన్ని తెలియ‌ని విష‌యాలు ఉన్నాయి. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. అయితే పురాణ గ్రంధాత ప్ర‌కారం..గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడట‌.


అలాగే  గ‌డ‌ప‌కు ప‌సుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయ‌డం ల‌క్ష్మీ ప్ర‌దం. దుష్ట‌శ‌క్తులు ఇంట్లోకి రావ‌ట‌. ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి గడపలోకి అడుగుపెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీ బయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.


గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్ళలో పిల్లలు చెప్పిన మాట వింటారు. అభివృద్ధి పథంలో నడుస్తారు. అలాంటి ఇళ్ళు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయ‌ట‌. అలాగే ఇంటికి మామిడి తోర‌ణాలు క‌ట్ట‌డం వ‌ల్ల మ‌నంవ‌దిలే కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను తీసుకుని ఆక్సీజ‌న్‌ను వ‌దులుతాయి. ఇలా హిందూ సాంప్ర‌దాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయ‌ని వేద పండితులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: