ఒకవైపు బతుకమ్మ పండుగ, మరోవైపు దేవీనరాత్రులు జరుగుతున్న వేళ ఇది. శక్త్యారాధనా సమయం. బతుకమ్మ పేరుతో పిలవబడే గౌరమ్మ , శరన్నవరాత్రులలో దుర్గాదేవి అయినా పరాశక్తి స్వరూపాలే. నిజానికి ఏ అమ్మయినా ప్రేమస్వరూపిణియే. కానీ, రాక్షస సంహారంతో ఉగ్రరూపం దాల్చే అమ్మవారిని శాంతస్వరూపిణి వలె పూజించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే, చాలామంది వేదపండితులు దేవీనవరాత్రులలో అమ్మవారి అర్చనపట్ల అత్యంత నియమనిష్ఠలతో ఉంటారు. పూజలు చేసేవారూ అంతటి భక్తిశ్రద్ధలను కలిగిఉన్నప్పుడే ఫలితం లభిస్తుందని వారంటారు.


అత్యంత దుర్భరమైన పరాశక్తి కటాక్షాన్ని పొందే సులభతరమైన మార్గాలు కొన్ని వున్నాయి వాటిని అవలంభిస్తే ఆదిపరాశక్తి కటాక్షానికి పాత్రులం అవ్వవచ్చూ అని చెబుతారు. ఇకపోతే ఈ విశ్వంలో మహాశక్తి పలువిదాలా వ్యక్తమవుతోంది. అదేలాగంటే ఒక మహానది ఆరంభస్థానంలో సూక్ష్మంగా ఉంటుంది, మహాగిరుల నుంచి క్రమంగా దుమికే రూపంలో ఉగ్రంగా, మరొక చోట వేగంగా, ఇంకొకచోట సౌమ్యంగా, వేరొక తావున ప్రళయ భీకరంగా, ఇలా బహురూపాలతో కనబడుతున్నట్లే, ఆ శక్తి ప్రవాహం  ఉగ్ర, సౌమ్య, ఉభయ మిశ్ర రూపాలతో నిర్వహిస్తోంది. అందుకే ఆ శక్తిలో కాళీ, చండీ వంటి ఉగ్ర రూపాలు ఉన్నట్లే  గౌరీ, లక్ష్మీ వంటి సౌమ్య రూపాలు, వాణి, గాయత్రి వంటి జ్ఞాన రూపాలు.వున్నాయి. కాబట్టే ఎన్నోవైవిధ్యాలను అనేక దేవతాకృతులుగా అర్చిస్తున్నాము.


ఇకపోతే పోషించే శక్తికి అన్నపూర్ణ, ప్రేమ శక్తికి రాధ, రక్షించే శక్తికి దుర్గ...ఈవిధంగా మన పురాణ గ్రంధాలు, మంత్ర శాస్త్రాలు విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేశాయి...ఇన్ని వైవిధ్య భరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధంచేసుకున్న హైందవ ధర్మంలోని అద్భుతానికి జోహారులు ! శరదృతువు ఆరంభంలో తేటమనసుతో ఆ మహాచైతన్యాన్ని “అమ్మా!” అంటూ పిలిచి పూజించే నవరాత్రుల వేడుకలో, దేశమంతా పునీతమౌతున్నది. హిమవత్పర్వతం జగదంబ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని వింధ్యవాసినికి నెలవుగా, చివరి భాగమైన మలయాళ ఖండాన్ని మలయాచల వాసిని భగవతికి తావుగా భావించిన శక్తి సంప్రదాయము.. ఈ దేశపు ఆది, మధ్య. అంతాలని జగదంబ స్థానాలుగా పూజించడమే, అడుగడుగునా “శక్తి పీఠాల”ను ప్రతిష్టించుకుంది.ఈ కారణం చేతనే ఈ దేశాన్ని తలచుకోగానే జగన్మాతృభావన పొంగుకువచ్చి ‘వందేమాతరం’ అని మోకరిల్లుతాం.అందుకే ఈ అవని అంత పవిత్రమైనదని చెబుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: