భార‌తీయుల సనాతన ధర్మంలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఇక శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చిందని చెబుతారు.


ఇకపోతే దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ద‌స‌రా రోజున ఉత్స‌వాలు మిన్నంటుతాయి. ఇక రాముడు రావ‌ణుడిపై విజ‌యం సాధించింది ఇదే రోజు క‌నుక‌..ఆ నేప‌థ్యంలో రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా దుర్గాదేవిని పూజిస్తూ విజ‌య‌ద‌శ‌మి జ‌రుపుకుంటారు క‌దా..మ‌రి దీనికి ద‌స‌రా అని పేరెలా వ‌చ్చిందో తెలుసా..దశహరా అంటే దశ విధ పాపహరం అని అర్థం. ద‌స్‌+హ‌రా..అంటే.. హిందీలో ద‌స్ అంటే తెలుగులో ప‌ది అని అర్థం వ‌స్తుంది. అంటే.. 10 త‌ల‌ల రావ‌ణాసురున్ని రాముడు హ‌త‌మార్చిన సంద‌ర్భం అన్న‌మాట‌.


అందుక‌నే మొద‌ట్లో విజ‌య‌ద‌శ‌మిని,ద‌శ‌హ‌రా అని వ్య‌వ‌హ‌రించేవారు. రాను రాను అది ద‌స‌రాగా మారింది. ఇక ద‌శ‌కంఠుడు అన్నా రావ‌ణాసురుడు అన్నా ఒకటే అర్థం వ‌స్తుంది.. ఇక ద‌శ‌హ‌రా అంటే 10 పాపాల‌ను తొల‌గించేది అనే అర్థం కూడా వ‌స్తుంది. అవి ఏంటంటే  మ‌నుషులు శారీరకంగా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి అపాత్ర‌దానం, శాస్త్రం అంగీక‌రించ‌ని హింస చేయ‌డం, ప‌ర‌స్త్రీ లేదా పురుషునితో సంగ‌మించ‌డం. ఇక నోటి ద్వారా చేసే పాపాలు 4 ఉంటాయి. అవి ప‌రుషంగా మాట్లాడ‌డం, అస‌త్యాలు చెప్ప‌డం, వ్య‌ర్థ ప్ర‌లాపాలు చేయ‌డం, అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను ఉప‌యోగించ‌డం.


అలాగే మ‌న‌స్సు ద్వారా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి ప‌రుల సొమ్మును త‌స్క‌రించాల‌నే బుద్ధి ఉండ‌డం, ఇత‌రుల‌కు బాధ క‌లిగించే ప‌నులు చేయ‌డం, అహంకారాన్ని క‌లిగి ఉండ‌డం. ఈ క్ర‌మంలోనే ఈ మొత్తం 10 పాపాల‌ను తొల‌గించేదిగా ద‌స‌రాను భావిస్తారు. ఇక ఈ పాపాలు పోవాలంటే.. ద‌స‌రా రోజున గంగాన‌ది స్నానం చేయ‌డం లేదా దుర్గాదేవిని ఆరాధించ‌డం చేయాల‌ని పురాణాలు చెబుతున్నాయి..


దసరా పండుగ నాడు ఉత్సవాలు కాస్త భిన్నంగానే ఉంటాయి. తొమ్మిది రోజుల పాటూ...దుర్గమ్మ విగ్రహాలకు పూజలు చేశాక...పదో రోజున అమ్మవారి విగ్రహాల్ని చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. అదే సమయంలో రావణాసురుడి దిష్టిబొమ్మలను తగలబెడతారు. ఆయనతోపాటూ...ఆయన సోదరులైన మేఘనాద, కుంభకర్ణుల దిష్టిబొమ్మల్ని కూడా తగలబెడతారు...ఈ దసరా పండుగ ముగుస్తూనే, దీపావళి వేడుకల సందడి మొదలవుతుంది.ఇక ఇదండి దసరాలోని విశిష్టత..

మరింత సమాచారం తెలుసుకోండి: