చిన్నప్పటి నుంచి రావణుడు అంటే రాక్షసుడు అనే  తెలుసు మన అందరికి. రామాయణంలో రాముడి గురించి మనకు ఎంత తెలుసో.. రావణాసురుడి గురించి కూడా అంతవరుకే తెలుసు. రామాయణంలో రాముడు నాయకుడైతే... రావణాసురుడు  ప్రతినాయకుడు. ధర్మములలోగాని, నీతులలో గాని  ఎవరికి ఎవరూ తీసిపోరు.

రావణుడు లంకకు అధిపతి. ఈయనకు దశముఖుడు అంటే పది ముఖములు, దశగ్రీవుడు అంటే పది శీర్షములు, దశకంఠుడు అంటే పది గొంతులు కలిగినవాడని ఇలా అనేక పేర్లు ఉన్నాయి. కైకసికి పుట్టిన తొలి సంతానమే ఈ రావణుడు. రావణునికి కుంభకర్ణుడు, విభీషణుడు సోదరులు కలరు. వారితో  పాటు శూర్పణఖ అనే సోదరి కూడా వుంది. 


రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, మయుడి కూతురు. రావణునికి  ఏడుగురు కొడుకులు కలరు. వాళ్ళు ఇంద్రజిత్తు, ప్రహస్థుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు. ఇలాంటి విషయాలన్నీ రామాయణం గురించి తెలిసిన  వారి అందరికి  తెలిసే ఉంటాయి. కానీ.. రావణుడి గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరిన్ని ఆసక్తికర విషయాలు గురించి   ఇప్పుడు చూద్దాం..


రావణుడు, సీత రావణుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. కానీ  జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీత తండ్రి అట. ఇదో ఒక పెద్ద  ఆశ్చర్యకర విషయమే కదా. పది తలలు ఉండటం వల్ల రావణుడిని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని గొప్ప తెలివి తేటలని సూచిస్తుంది. అంతేకాదు.. రావణుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట. రావణుడు సైన్స్, మెడిసిన్స్ స్కాలరట. ఎందుకంటే.. ఆ కాలంలోనే అతను పుష్పక విమానంలో తిరిగేవాడు అని అందరికి తెలిసిందే కదా. దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్ పై ఉన్న మక్కువ తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే  రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. రాత్రి, పగలు శివుడిని ఎక్కువగా పూజించేవాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: