దసరా... ఈ పేరు వినగానే మన అందరికి గుర్తుకు వచ్చేది ఆది పరాశక్తి. హిందువులు భక్తి శ్రద్ధలతో పది రోజులు జరుపుకుంటారు. ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో అలంకరణ చేసి చూపురలకు కనువిందు చేస్తుంది. ఇది ఇలా ఉంటే  దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేశంలోని అన్ని అమ్మవారి దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో వెదజల్లుతున్నాయి. అయితే దసరా కోసం కొన్ని ప్రాంతాలలో దేవాలయాలు, నగరాలు మరింత కాంతివంతంగా మారుతాయి. ఆయా ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలను నేరుగా తిలకించాల్సిందేకాని వర్ణించడానికి మాటలు, అక్షరాలు సరిపోవు. కొన్ని చోట్ల శ్రీరాముడు రావణుడిని సంహరించినందుకు ఈ ఉత్సవాలను జరుపుకుంటే మరికొన్ని చోట్ల ఆ జగన్మాతను తలుచుకుంటూ ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీ. 


ఇలా భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక స్థలాల గురించిన సమాచారం ఇప్పుడు మీ కోసం అందిస్తున్నాం. దసరా ఉత్సవాలు అన్న ప్రతి ఒక్కరికీ మొదటగా గుర్తుకు వచ్చేది మైసూరు. ఇక్కడ జగద్విక్యాతమైన మైసూరు దసరా ఉత్సవాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలాగే మైసూరు ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే అష్టాదశ పీఠాల్లో మైసూరు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు. ఇక మైసూరు రాజప్రసాదంలో జరిగే దసరా ఉత్సవాలు చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.


ఇక మైసూరు ప్యాలెస్ లో మొదట విజయదశమి వేడుకలు క్రీస్తుశకం 1610లో రాజా వడయార్ తొలిసారిగా నిర్వహించారు. ఇక క్రీస్తుశకం 1805లో కృష్ణరాజా ఒడయార్-3 హయాంలో దసరా సందర్భంగా ప్రత్యేక దర్బార్ నిర్వహించే సంప్రదాయం మొదలయ్యింది. ఏనుగులు విజయదశమి రోజు రాచనగరి మైసూర్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంద. రాచనగరి వీధుల్లో ఏనుగులు రాజసంతో సాగిపోతుంటాయి. అంబారీ పై అమ్మవారిని ఊరేగిస్తారు.
ఈ అంబారి పై ఉన్న అమ్మవారిని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తుంటారు. దీనినే జంభూస్వారీ అని పిలుస్తారు. రాజభవనం దగ్గర మొదలయ్యే ఊరేగింపు బన్ని మంటపం వరకూ సుమారు నాలుగన్నర కిలోమీటర్ల మేర కొనసాగుతుంది ఈ అంబారీ.

ఇంకా ఈ మైసూర్లో అందరూ చూడ దగ్గ ప్రాంతం ఎగ్జిబిషన్. ఇక దసరా సందర్భంగా ప్యాలెస్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ వరకూ కొనసాగే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హాజరవుతారు.ఇలా మైసూర్లో ప్రతి ఇంటా దుర్గాదేవి ఆరాధనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వీధుల్లోకి వచ్చి చూస్తే శరన్నవరాత్రి వైభవం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కాళీదేవి మంటపాలు, కిక్కిరిసిన కూడళ్లలో వినతగ్గ సంగీత కచేరీలు, కనుల విందైన ప్రదర్శనలతో పండగ వాతావరణం నెలకొంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: