ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు శనివారం,19.10.2019 ఉదయం 6 గంటల సమయానికి తిరుమల: 20C°-26℃°.


• నిన్న 71,085 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 గదుల్లో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు  06 గంటలు పట్టవచ్చును.


• నిన్న 29,126 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 4.22 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును.


గమనిక:


* అక్టోబ‌రు 30 తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


* అక్టోబరు 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం, (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు)


* వయోవృద్దులు / దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.  ఉ: 7 గంటలకి చేరుకోవాలి ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: