హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపాల వరుసగా పేర్కొనే ఈ పండుగను దక్షణాది కన్నా ఉత్తరాది వారే ఎంతో వైభవంగా మరియు దాదాపు ఐదురోజులు పాటు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ సమయంలో వచ్చే దంతేరస్  ను పురస్కరించుకుని లక్ష్మి దేవిని నిష్టగా పూజించి, అర్చిస్తే ఆమె మనకు సకలసిరులు, అష్టఐశ్వర్యాలు సిద్దిపచేస్తుందని వినికిడి. ఇక దీపావళి సందర్భంగా కొద్దిరోజులు ముందుగానే మనము ఇప్పుడు చెప్పుకునే ఈ వస్తువులను ఇంటి నుండి బయట పారవేస్తే లక్ష్మి దేవి కృప మనకు లభిస్తుందని అంటున్నారు శాస్త్ర నిపుణులు. అవి ఏవంటే, ఇంట్లో వుండే పాత మరియు చిరిగిన వాడని బట్టలు, విరిగిపోయిన పాత సామానులు, ఫర్నిచర్, ముఖ్యంగా పగిలిన అద్దాలు, అన్నిటికంటే ముఖ్యంగా సాలిగూడు ఇంట్లో ఉండకూడదట. 

అవి ఇంట్లో నెగటివ్ ఎనర్జి ని ప్రసరింప చేసి పాజిటివిటీ పై తీవ్ర ప్రభావం చూపుతాయట. అంతే కాదు ఇంట్లోని ద్వారాలు, గోడలు, గవాక్షాలు ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరుచుకోవడం, ఇక ముఖ్యంగా ఇంటి ప్రధాన ముఖ ద్వారాన్ని బాగా శుభ్రం చేసి దాని గడపను పసుపు కుంకుమతో అలంకరించాలట. పండుగనాడు ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటోందో లక్ష్మీదేవి ఆ ఇంట కొలువు తీరుతుందని, కావున ఇలా చేయడం వలన మనకు ఆ లక్ష్మి దేవి కృప తప్పకుండా దక్కుతుందని చెప్తున్నారు. అంతేకాక పండుగ నాడు లక్ష్మి పూజ తరువాత సాయంత్రం సమయంలో ముందుగా మనం వెలిగించవలసిన దీపాలను, ఒక్కొక్క దీపానికి రెండేసి వొత్తులు చొప్పున వెలిగించి మన ఇంట్లోని తులసి కోట దగ్గర ఉంచాలట, 

ఆ తరువాత తులసి కోటకు నమస్కరించిన అనంతరం వాటిని ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే, ఆయా గుమ్మాలకు అటు ఇటు, ఒక్కోటి చొప్పున దీపాలు ఏర్పాటు చేయాలని, అలానే వాటిలో నూనె ఇంకిపోతుంటే మళ్ళి నూనెపోయడం వంటివి మాత్రం తప్పనిసరిగా చీకటిపడేవరకు చేయాలట. ఇక ఆ రోజున తలస్నానం చేసిన తరువాత తీపి తప్పక తినాలని, అనంతరం దీపాలను అమర్చాక, టపాసులను ప్రతి ఒక్కరు కనీసం ఒకటి లేదా రెండు అయినా కాల్చాలని, అలా చేయడం మంచిదని కూడా చెపుతున్నారు. కాబట్టి మీరు కూడా పైన చెప్పుకున్న విధంగా పాత వస్తువులను ఇంటినుండి తీసివేసి, లక్ష్మీదేవిని ఎంతో నిష్టగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: