భారతదేశంలోని హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం, ఈ పండుగ నాడు ఇంటిలో ముందుగా ఉదయాన్నే ఇంటిల్లిపాది నిద్దుర లేచి, తలారా స్నానం చేసి మన ఇష్టదైవాన్ని పూజ చేసి, కాస్త తీపి తినడం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఇక సాయంత్రం వేళ ఇంటిబయట దీపాలు పెట్టి టపాకాయలు కాల్చడం, ఇది మన అందరికి సాధారణంగా తెలిసిన పండుగ విధానం. అయితే వాస్తవానికి ఉదయాన్నే పూజను ఎంతో శ్రద్దగా చేసే మనలోని చాలామంది, సాయంత్రం మాత్రం మాములుగా దీపాలు పెడుతుంటారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా కనుక పూజ లక్ష్మి పూజ నిర్వహిస్తే, ఆమె మనకు సకల సిరులు అనుగ్రహిస్తుంది. ఇక దీపావళి పండుగనాడు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోని మగపిల్లలతో గడప బయట వారిని నిలబెట్టి, 

నూనెలో నానబెట్టిన ఒత్తులను తీసుకుని వాటిని గోగు కాడలకు చుట్టి వెలిగించి, అవి వారి చేతికిచ్చి, దక్షిణ దిక్కుగా నిలబడి 'దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళి వచ్చేనమ్మా నాగుల చవితి' అంటూ వాటిని నేలకు కొట్టించి, ఆపై పిల్లలను లోనికి పిలిచి కాళ్ళు, చేతులు కడుక్కొమ్మని, వారికి నిప్పులపై సాంబ్రాణి లేదా గుగ్గిలం వేసి ఆ ధూపం అందించాలి. ఆపై అందరూ కలిసి తులసి మాత వద్దకు చేరి, ఆ తులసి మొక్కకు పసుపు, కుంకుమతో అలంకరించి, ముందుగా రెండు రెండుగా ప్రమిదలను తీసుకుని వాటిలో రెండేసి చొప్పున ఒత్తులను నూనె పోసి వెలిగించాలట. ఆపై వెలిగించిన దీపాలను మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో, ఆయా గదుల గుమ్మాల్లో ఒక్కొక్క గుమ్మానికి రెండేసి చొప్పున ఆ దీపాలను ఉంచాలి. 

అనంతరం లక్ష్మి దేవికి మనకు తెలిసిన విధంగా పూజ నిర్వహించి, ఆపై ఆమెకు నమస్కారం చేసుకుని, ఏదైనా తీపి పదార్ధాన్ని నోట్లో వేసుకుని, అనంతరం కొనుగోలు చేసిన టపాసులను కాల్చడం చేస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందని, శాస్త్ర నిపుణులు చెపుతున్నారు. అయితే వీలున్నంతవరకు ఎక్కువ శబ్దం మరియు పొగ వచ్చే టపాసులను కాల్చకూడదని, నిజానికి దీపారాధనగా చెప్పుకునే ఈ పండుగ నాడు, దీపం ముట్టించి దానివెలుగులో టపాసులను కాల్చడమే తప్ప దానివల్ల ఎవరికీ ఇబ్బందులు కలిగించకూడదు అనేది కూడా శాస్త్రాలలో చెప్పబడిందట. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా దీపావళి పండుగ నాడు సాయంత్రం లక్ష్మి దేవి పూజ చేసుకుని ఆమె యొక్క అనుగ్రహం మీరు కూడా పొందండి మరి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: