దీపావళి అనగానే   అందరికి గుర్తుకు వచ్చే వాటిల్లో ఒకటి స్వీట్స్. మనం అనేక సందర్భాలలో లేకపోయిన ఎప్పుడో ఒకప్పుడైనా ఖచ్చితంగా తిని ఆస్వాదించే వాటిలో ముందు ఉండేవి మిఠాయిలు మాత్రమే. ఇవి ముఖ్యంగా మన పెద్దవారు చేయడంలో నేర్పరితనం కలిగిన వారు. ప్రస్తుతం ఈ కాలానికి చెందిన వారు ఏవైనా కావాలంటే వెంటనే ఫోన్ తెరిచి ఆన్ లైన్ లో  ఎక్కడెక్కడో ఏ షాప్ లో ఏ రకమైన స్వీట్ బాగుంటుందో వెతికి మరి ఆర్డర్ తెప్పించుకొనే కాలం ఇది.


కానీ ఈ సారి కాస్త ఓపిక తెచ్చుకొని ఒక సారి మీ ఇంట్లోనే తయారు చేసి మీ ఇంటిళ్లిపాదులకు పెట్టండి. మాకు ఇలాంటి చేయడం రాదు అని అనుకోకండి. అలంటి వార్లకోసమే ఈ వంటకం.  ఇండియన్ స్వీట్లలో కజ్జికాయ చాలా విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు అనే అనుకోవచ్చు. కజ్జికాయ అనేక వెరైటీల్లో ముఖ్యంగా చెప్పుకొనేది కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ గురించి తెలుసుకుందాం. 


ఈ రుచికరమైన కోవా కజ్జికాయని ఎలా చేయాలో ఇలా ఒక లుక్ వేయండి. మొదటగా మనకు కావలిసిన ముడి సరుకుల విషయానికి వస్తే మైదాపిండి, పంచదార, పాలకోవా, జాపత్రి, యాలకులు, శనగపిండి, వంట సోడా, బేకింగ్ పౌడర్, నెయ్యి, వంట నూనె అవసరమైతాయి. ఇక కోవా కజ్జికాయని తరి విధానానికి వస్తే శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇంకో గిన్నెలో మిగిలిన పంచదార పోసి, రెండు గ్లాసులు నీళ్లు పోసి లేత పాకం వచ్చే వరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయాలి. దీనిని ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చుట్టుకోవాలి. 


ఇలా రెడీ చేసుకున్న వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు రెడీ... ఇంకేం ఉంది మీ ఇంటిల్లిపాది మీ చేతులతో చేసిన కోవా కజ్జికాయని ఈ దీపావళికి తినిపించండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి కావలిసిన సరుకులు కొనుగోలుచేద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: