రామాయణం మరియు మహాభారతం హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. మహాభారతం లో మనకు సమాధానం దొరకని ప్రశ్నలు ఉండవు  అని అందరూ అంటూ ఉంటారు.మహాభారతాన్ని ఎంత మంది ఎన్ని రకాలుగా రాసినా... అది ఎప్పుడు జరిగిందన్నదానిపై ఒక్కొక్కరికీ ఒక్కో టైమ్‌లైన్ ఉంటోంది. బట్... మనం ఏదైనా నమ్మాలంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి కదా... అనేవారికి తాజాగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు పురావస్తు పరిశోధకులు.

వారు చెబుతున్నదాని ప్రకారం... మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కిందట జరిగింది.2018లో మంజుల్‌ టీమ్... ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలీ అనే ఊరిలో తవ్వకాలు జరిపింది. గుర్రంతో నడిపిన రథం , గుర్రాలను కంట్రోల్ చేసే కొరడా, రథ చక్రాలు, హెల్మెట్స్ , పిడి కత్తి, డాలు, బాణం, విల్లు, ఒక శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి ఆ తవ్వకాల్లో దొరికాయి. అక్కడ కొన్ని పాత్రలు, రాణి నాణేలు కూడా దొరికాయి.

అవి ఎప్పటివో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపారు. అవి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటివిగా తేలింది. అందువల్లే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 2000-1500 మధ్య జరిగినట్లుగా అంచనాకు వచ్చారు. ఐతే... తాజా అంచనాలే కరెక్ట్ అని మనం నిర్ధారణకు వచ్చేయలేం. అదే నిజమైతే... మరి ఇదివరకు అంచనా ఎందుకు రాంగ్ అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆల్రెడీ బీబీలాల్ స్పందించారు. తాను చెప్పినదే రైట్ అంటున్నారు ఆయన.

ఎందుకంటే మహాభారతంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థ గురించి ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రామాయణం మరియు భాగవతం మహాభారతం వాటి స్తానం వాటివే   అవి ఎప్పటికీ చెరగని  ముద్ర మన పై వేసాయి. ఈ  పురావస్తు శాఖ ఏమి చెప్పినా కూడా అంత సులువుగా నమ్మలేము.


మరింత సమాచారం తెలుసుకోండి: