శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఒక  పథకాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.అయితే శ్రీవారి వీఐపీ దర్శనం కోసం శ్రీవారి భక్తులు రూ. 10వేలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.కేవలం సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.


వివరాల్లోకి వెళ్తే.... మొదటి 15 రోజులపాటు తిరుమలలో కరెంటు బుకింగ్ విధానంలో టిక్కెట్లను అందించనున్నట్లు చెప్పారు.ఈ ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామని చెప్పారు. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తామని వివరించారు. విరాళంగా ఇచ్చే రూ. 10వేలతోపాటు టికెట్‌ను రూ. 500తో కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.నవంబర్ తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్ పథకానికి సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.ఈ సేవకు వచ్చే నిధులను రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి వెచ్చించనున్నట్లు తెలిపారు.గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.


కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా, అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: