ఈ మ‌ధ్య మార్కెట్‌లో ఏది చూసినా న‌కిలీ వ‌స్తువే వ‌స్తుంది క‌దా. చిల్లర వస్తువులనే నకిలీ చేసేస్తున్నారు. అలాంటిది బంగారం వెండి మాత్రం తగ్గుతారా?   పైగా పండగ సీజన్ కావడంతో చాలా మంది వ్యాపారులు న‌కిలీ బంగారు, వెండి నాణేల‌ను ఒరిజిన‌ల్ అని చెప్పి అమ్ముతున్నారు.  ల‌క్ష్మీపూజ‌… ధంతేర‌స్‌… దీపావ‌ళి… ఇలా పండుగల సంద‌ర్భంగా చాలా మంది బంగారం కాకున్నా క‌నీసం వెండి నాణేల‌ను అయినా కొంటుంటారు. అంతే కాదు వెండితో పూజిస్తే ల‌క్ష్మీదేవి అనుగ్రహం క‌లుగుతుంద‌ని చాల మంది న‌మ్మ‌కం. అయితే అనుగ్ర‌హం వచ్చే మాట ఎలా ఉన్నా వెండి నాణేలను కొనే విష‌యంలో మాత్రం క‌చ్చితంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. లేదంటే మోస‌పోవ‌డం మీ వంతవుతుంది. 


క‌నుక వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ క్ర‌మంలో ఏది న‌కిలీ సిల్వ‌ర్ కాయినో, ఏది అస‌లుదో, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ధ్వ‌ని ప‌రీక్ష‌…కంచుమోగినట్టు కనకం మోగునా అన్నట్టు.... శబ్దాన్ని బట్టి కూడా లోహం నాణ్యత తెలుసుకోవచ్చు. ఎలా అంటే సిల్వ‌ర్ కాయిన్‌ను చేతి వేలితో ట‌చ్ చేసి సౌండ్ చేస్తే ఆ సౌండ్ 1-2 సెకండ్ల వ‌ర‌కు అలాగే మ‌న‌కు వినిపిస్తుంది. అదే విధంగా కాయిన్‌ను ఆర‌డుగుల ఎత్తు నుంచి కింద ప‌డేస్తే పెద్ద‌గా సౌండ్ వ‌స్తుంది. అదే న‌కిలీ కాయిన్ అయితే ఇనుము సౌండ్ వ‌స్తుంది.


ఐస్ ప‌రీక్ష‌…లోహాల‌న్నింటిలోనూ వెండికి ఉన్న‌టువంటి ఉష్ణ‌వాహ‌క‌త దేనికీ లేదు.  ఏదైనా సిల్వ‌ర్ కాయిన్ లేదా బార్‌పై ఓ చిన్న ఐస్ క్యూబ్‌ను ఉంచితే అది వెంట‌నే క‌రిగిపోతుంది. అలా క‌ర‌గ‌లేదంటే అది న‌కిలీ సిల్వ‌ర్ కాయిన్ /  బార్ అయి ఉంటుంది.ప్యూరిటీ స్టాంప్‌…బంగారాన్ని క్యారెట్ల‌లో కొల‌వ‌డం ద్వారా అందులో నాణ్య‌త ఎంత ఉందో సింపుల్‌గా తెలుసుకుంటాం క‌దా. అలాగే వెండికి కూడా స్వ‌చ్ఛ‌త‌ను ప‌రీక్షించ‌వ‌చ్చు. అదీ హాల్‌మార్క్ గుర్తుతో. అంతేకాదు,  ఆ గుర్తుతోపాటు స‌ద‌రు కాయిన్ లేదా బార్‌పై అందులోని వెండి స్వ‌చ్ఛ‌త‌ను తెలియ‌జేసే విధంగా 99.9, 95 శాతం అని సంఖ్య‌లు ఉంటాయి. అంటే అంత శాతంలో ఆ వెండి స్వ‌చ్ఛ‌మైంద‌న్న‌మాట‌.

మాగ్నెట్ టెస్ట్‌…అస‌లుసిసలైన వెండి అయ‌స్కాంతానికి అతుక్కోదు. ఒక వేళ మీరు కొన్న వెండి కాయిన్ లేదా బార్ అయ‌స్కాంతానికి అతుక్కుంటే గ‌న‌క అది న‌కిలీద‌ని గుర్తించండి. మీరు కొన్న సిల్వ‌ర్ బార్ లేదా కాయిన్‌ను 45 డిగ్రీల కోణంలో వంచి దానిపై చిన్న‌పాటి అయ‌స్కాంతాన్ని పెడితే అది నెమ్మ‌దిగా జారుతుంది. ఒక వేళ స‌ద‌రు అయ‌స్కాంతం నెమ్మ‌దిగా జార‌కుండా వేగంగా జారినా లేదంటే ఆ అయ‌స్కాంతం స‌ద‌రు వెండి కాయిన్ లేదా బార్‌కు అలాగే అతుక్కున్నా మీరు కొన్న వెండి వ‌స్తువులు న‌కిలీవ‌ని తెలుసుకోండి.కెమిక‌ల్ టెస్ట్‌…ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల‌లో వెండి వ‌స్తువుల నాణ్య‌త‌ను ప‌రీక్షించే కిట్స్ దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుని కూడా మీరు కొన్న వెండి వ‌స్తువులు అస‌లువో, న‌కిలీవో ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. కాక‌పోతే స‌ద‌రు కిట్‌ల‌ను వాడితే వెండి వ‌స్తువుల‌పై మ‌ర‌క‌లు ప‌డ‌తాయి. కాబ‌ట్టి స‌ద‌రు కిట్‌ల‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: